వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన అది వివాదంగానే మారుతుంది. వర్మ ఏ విషయం గురించి అయినా ట్వీట్ చేశాడంటే ఆ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎన్నో వివాదాలకు తెర లేపిన రాంగోపాల్ వర్మ ట్వీట్స్ తాజాగా మరొక వివాదానికి తెరలేపింది. వర్మ తాజాగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సిక్స్ ప్యాక్ ఫోటోని ఉద్దేశించి వర్మ ట్వీట్ చేస్తూ… మీరు మార్షల్ ఆర్ట్స్ లో చాలా గొప్పవారు.. కానీ బ్రూస్ లీ కూడా మీలాగే బికినీ బేబ్ ఫోజులిస్తే అతను బ్రూస్ లీ అయ్యేవాడు కాదు.. ఆలోచించండి మార్షల్ ఆర్ట్ లేకుండా కూడా మనిషిలా ఉండే ఇలా ఎప్పుడు ఇష్టపడని భీదుడు నుంచి మాకోయిజం నేర్చుకోండి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే టైగర్ అర్బాజ్ ఖాన్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అర్బాజ్ వర్మ చేసిన ట్వీట్ చదివి వినిపించగా అందుకు స్పందించిన టైగర్ ఈ విధంగా తెలిపారు.. వర్మ చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నాను ఆయన సరిగ్గానే చెప్పారు.బైజాన్(సల్మాన్ ఖాన్) కాకుండా భీదుడి(జాకీ ష్రాఫ్) మ్యాచోయిజంతో ఎవరు సరిపోగలరని ఈ సందర్భంగా టైగర్ చెప్పాడు.
ఈ క్రమంలోనే అర్బాజ్ నెటిజనులు చేసిన ఒక ట్రోల్ తన ముందు ఉంచి మీరు వర్జినా కాదా? అని ప్రశ్నించగా అందుకు టైగర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ విషయంపై టైగర్ స్పందిస్తూ నేను సల్మాన్ ఖాన్ లాంటి వాడిని తెలిపారు. సల్మాన్ వర్జిన్ అయితే నేను కూడా వర్జిన్ అంటూ చెప్పారు. సల్మాన్ ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నట్లు మనకు తెలిసిందే.మరి టైగర్ కూడా పరోక్షంగా తనకు ఎఫైర్లు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.





























