Sangavi: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సంఘవి ఒకరు. ఈమె ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం అలాగే అధిక శరీర బరువు పెరగడంతో క్రమంగా అవకాశాలను కోల్పోతూ వచ్చారు..

ఇలా అవకాశాలు కోల్పోయిన ఈమె ప్రస్తుతం బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు. ఇలా పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంఘవి గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో తమిళంలో ఎక్కువగా హీరో తలపతితో సినిమాలు చేసేవారు.
ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీరిద్దరూ వరుస సినిమాలలో నటించడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. దీంతో బిజీ తండ్రి నేరుగా సంఘవి ఇంటికి వెళ్లి ఆమె తల్లికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. నా కొడుకు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచిగా ఎదుగుతున్నారు.
విజయ్ దళపతి..
ఇలా నా కొడుకు ఎదుగుతున్న క్రమంలో నీ గురించి నా కొడుకు గురించి తప్పుగా వార్తలు వస్తున్నాయి ఇది నా కొడుకు కెరియర్ పై ప్రభావం చూపుతుంది అందుకే ఇంకొకసారి నా కొడుకుతో కలిసి బయట ఎక్కడ కనిపించకూడదు. అలా కాదని నా కొడుకుతో మాట్లాడుతూ కనిపిస్తే నీ కెరియర్ నే నాశనం చేస్తాను అంటూ సంఘవి కి వార్నింగ్ ఇచ్చారట. అంతేకాకుండా అప్పటికే ఆమె కమిట్ అయిన సినిమాలను కూడా కోల్పోయేలాగా చేయడంతో తనకు క్రమక్రమంగా తమిళ అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారని తెలుస్తుంది.

































