Shivani Rajasekhar: టాలీవుడ్ సీనియర్ హీరో జీవిత రాజశేఖర్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఆయన కూతురు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని ఒక వైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా శివాని తాను మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం లేదని, ఆ పోటీలో నుంచి తప్పుకున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అద్బుతం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివాని పలు సినిమాలలో నటిస్తున్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది.మిస్ ఇండియా పోటీలలో పాల్గొంటున్నానని తెలియజేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలిపారు. జులై మూడవ తేదీ మిస్ ఇండియా కాంటెస్ట్ ఉండగా ఈమె షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు.

తాను మిస్ ఇండియా పోటీలలో పాల్గొనలేదని జులై మూడవ తేదీ ఈ కాంటెస్ట్ ఉండగా, అదే రోజు తన మెడికల్ మెడికల్ థియరీ ఎక్సామ్ ఉండటం వల్ల తాను ఈ పోటీలలో పాల్గొనడం లేదని వెల్లడించారు.తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ ఈమె తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టారు.
ఆల్ ది బెస్ట్ చెబుతున్న అభిమానులు….
ఇలా మెడికల్ థియరీ ఎగ్జామ్ కారణంగా మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్నానని ఈమె వెల్లడించడంతో ఎంతోమంది అభిమానులు కొంతమేర నిరాశకు గురైన, ఈమె డాక్టర్ చదువు కోసం ఫెమినా మిస్ ఇండియా లాంటి కంటెస్ట్స్‌కు దూరంగా ఉండటం పెద్ద విషయం కాదని తను త్వరలోనే ఒక డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని పలువురు వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.ఇక తనకు మెడికల్ థియరీ ఎగ్జామ్ ఉందని తెలియడంతో ఎంతో మంది అభిమానులు తనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
































