TDP: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత పది సంవత్సరాలపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు అయితే ఈ కాల పరిమితి కూడా జూన్ రెండో తేదీకి పూర్తి కానుంది ఇలా ఉమ్మడి రాజధాని కాల పరిమితి కూడా పూర్తి కావడంతో ఆంధ్రకు రాజధాని ఏది అనే విషయంపై ప్రతి ఒక్కరూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటు కోసం ఇక్కడ రైతుల నుంచి కొన్ని వేల ఎకరాల భూమిని కూడా తీసుకున్నారు.
గతంలో అమరావతికి మద్దతు తెలిపిన వైసిపి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి తీసుకోవచ్చారు. దీంతో అమరావతి రైతులు మూడు సంవత్సరాల పాటు ఉద్యమం చేపట్టిన ఏపీకి మాత్రం మూడు రాజధానులు ఉండాలని జగన్ వెల్లడించారు.ఇక ఈసారి ఎన్నికలలో కనుక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తన ప్రమాణస్వీకారం వైజాగ్ లోనే జరుగుతుందని వైజాగ్ నుంచి పరిపాలన ఉంటుందని చెప్పేసారు.
వైజాగ్ నుంచే పరిపాలన….
అమరావతి రాజధానిగా రావాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని అమరావతిని రాజధానిగా నిర్మించే సత్తా చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందని చెప్పాలి. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోతే ఆంధ్రుల పూర్తిగా అమరావతిని మర్చిపోవాల్సిందేనని తెలుస్తోంది.





























