Actress Archana: టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పలు భాషలలో వివిధ చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్చన గురించి అందరికీ తెలిసిందే.ఈమె తన సినీ కెరీర్ లో కొన్ని పాత్రల కోసం కొన్ని సినిమాలను కూడా వదులుకున్నానని,అదే తాను చేసిన పెద్ద తప్పు అంటూ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.

ఇక ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో చేదు సంఘటనలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈమె పలు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఇండస్ట్రీలో తాను కేవలం కొన్ని పాత్రలు మాత్రమే నటించానని అయితే తాను నటించిన ఏఒక్క పాత్ర తనకు బాడ్ ఇమేజ్ తీసుకురాలేదని అన్ని మంచి పాత్రలలో నటించానని ఈమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

అయితే కెరీర్ లో కొన్ని కారణాల వల్ల తాను ఎంతో మంచి ప్రాజెక్టులను వదులుకున్నానని ఆ విషయంలో తాను ఎంతో డిసప్పాయింట్ అయ్యానని కూడా అర్చన తెలియజేశారు.ఇక తాను నటించిన ఒక ప్రాజెక్ట్ మిస్ఫైర్ అయిందని ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన అర్చన మరొక సినిమాలో మంచి పాత్రలో నటించానని ఆ సినిమాలో నా పాత్ర మల్లిక ఈ సినిమాకు ఎంతో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ తనకు మాత్రం అవార్డు రాలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆ హీరో అలా వెళ్లిపోవడంతో ఎంతో బాధపడ్డాను…
ఈ సినిమాలో తనకు బదులు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన మరొక అమ్మాయికి అవార్డు ఇవ్వాలని చెప్పడంతో వేదికపై నేను మరొక స్టార్ హీరోతో కలిసి ఆ అమ్మాయికి అవార్డు ఇవ్వాల్సి ఉంది.ఈ క్రమంలోనే ఆ హీరోని వేదికపైకి ఆహ్వానించగా ఆ హీరో మాత్రం తనతో కలిసి అవార్డు ఇవ్వనని చెప్పి వేదికపై నుంచి దిగి వెళ్లిపోయారని అర్చన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇలాంటి కొన్ని సంఘటనలు మనసుకు ఎంతో బాధగా ఉంటాయని వీటి వల్ల చాలా డిసప్పాయింట్ కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నటి తెలియజేశారు. ఇలా ఆ హీరో వల్ల ఎంతో బాధ పడ్డానని చెప్పిన ఈమె ఆ హీరో ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు.


































