డిసెంబర్ 23, 2016 వ సంవత్సరంలో దాసరి కిరణ్ నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన టువంటి చిత్రం వంగవీటి. ఈ సినిమా విజయవాడ ప్రముఖ రాజకీయ నాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగ, ఆయన సోదరుడు వంగవీటి రాధా మోహన్ జీవిత ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో కొంత మేర వివాదం సృష్టించిందని చెప్పవచ్చు. ఈసినిమాలో వంగవీటి మోహన రంగాకు శత్రువు అయినటువంటి దేవినేని మురళి మధ్య ఈ కథ తెరకెక్కింది.

ఈ సినిమాలో దేవినేని మురళి పాత్రలో నటుడు వంశీ చాగంటి నటించారు. ఈ సందర్భంగా వంశీ చాగంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనీ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రెండు వర్గాలుగా ఉండేవని సినిమా షూటింగ్ లొకేషన్ కు అటు వంగవీటి అభిమానులు, ఇటు దేవినేని అభిమానులు కూడా వచ్చేవారిని తెలియజేశారు.

సినిమా పేరు వంగవీటి కావడంతో ఎక్కువగా వంగవీటి కుటుంబానికి సంబంధించిన అభిమానులు షూటింగ్ ప్రాంతానికి వచ్చేవారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఎల్లూరులో షూటింగ్ జరుగుతున్న సమయంలో వంగవీటి అభిమానులలో ఒకరు ఫోన్ లో మాట్లాడుతూ అన్న ఇప్పటికీ రంగాగారి ర్యాలీ అయిపోయింది.. ఇక మురళిగాడి ర్యాలీ ఉందంటూ మాట్లాడారు. ఇలా ఈ జనరేషన్ లో కూడా రెండు వర్గాల మధ్య కక్షలు,ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా ఎక్కువగా ఉన్నాయంటూ ఈ సందర్భంగా వంశీ తెలియజేశారు.

నేను ఈ సినిమాలో దేవినేని మురళి పాత్రలో చేస్తున్నప్పుడు అతని అభిమానులలో ఒకడు ప్రతిరోజు నాకు మెసేజ్ చేసి చాలా ఇబ్బంది పెట్టేవారు తన అభిమాన నాయకుడి పాత్ర సినిమాలో ఏ విధంగా ఉంటుందో కనుక్కోవాలనే ఆతృతతో ప్రతిరోజు నాకు మెసేజ్ చేస్తూ నన్ను రెచ్చగొట్టేలా చేశారని..ఇప్పటికీ ఆ వ్యక్తి తనతో కాంటాక్ట్ లో ఉంటూ ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారని తెలిపారు. ఇలా వంగవీటికి, దేవినేని మురళికి శత్రుత్వం ఉన్నప్పటికీ వారిద్దరికీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇలా రెండు గ్రూపులుకి అక్కడ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అక్కడ వంగవీటి కొందరికి దేవుడైతే.. దేవినేని మురళి కొందరికి హీరో అంటూ వంశీ చాగంటి దేవినేని మురళి, వంగవీటి రంగా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
































