మనుషులు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మంచి విటమిన్లు, ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాదం : ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన బాదంను తీసుకోవడం వల్ల ఎసిడిటీ,అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ బాదంలో ప్రోటీన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.
అవిసె గింజలు : నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి.అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
ఎండు ద్రాక్ష : ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎసిమియా,కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలు తగ్గుతాయి.వీటిని నానబెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పొటాషియం,కాల్షియం,మెగ్నీషియం, ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.
మెంతులు : వీటిని ఎక్కువగా వంటలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల, ఇందులో ఉండే ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది షుగర్ పేషెంట్లకు కూడా మేలు చేస్తుంది.
మొక్క పెసలు : వీటిలో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. జీర్ణ సమస్యలను పోగొట్టడమే కాకుండా, గ్యాస్ కాన్స్టిట్యూషన్ వంటి వాటి నుండి బయట పడవచ్చు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.































