Ileana: బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఇలియానా… వైరల్ అవుతున్న ఫోటోలు!

0
35

Ileana: దేవదాసు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇలియానా అనంతరం పోకిరి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇలియానాకు అనంతరం అవకాశాలు తగ్గిపోయాయి.

కథల ఎంపిక విషయంలో కాస్త తడపబడిన ఇలియానా వరుసగా ఫ్లాప్ సినిమాలను చెవిచూచింది దీనితో ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఇలా సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇండస్ట్రీకి దూరమైన ఇలియానా తిరిగి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూశారు అయితే ఈమెకు అవకాశాలు రాకపోగా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టారు. ఇలా ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Ileana:క్లియర్ గా కనిపిస్తున్న బేబీ బంప్…


ఇక ఇలియానా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తరచూ తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు గత కొద్ది రోజుల క్రితం బేబీ బంప్ ఫోటోని షేర్ చేసిన ఇలియానా తాజాగా బ్లాక్ డ్రెస్ లో తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ డ్రెస్సులో బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది.బేబీ బంప్ ఫోటోలు వైరల్ కావడంతో పలువురు ఈ ఫోటోలు పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.