Ileana: దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గోవా బ్యూటీ ఇలియానా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. అయితే క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇలియానా గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడిన ఇలియానా కొంచెం బొద్దుగా తయారయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఇలియానా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. తాజాగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఒక పోస్ట్ చేశారు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
చిన్నారి డ్రెస్ మరియు మామా అని ఉన్న లాకెట్ ఫొటోలను షేర్ చేసింది. అంతే కాకుండా ” కమింగ్ సూన్, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను” అని రాసుకోచ్చింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా… ఆమె తల్లి కావడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ తమ్ముడు అనే వార్త బయటికీ వచ్చింది. ఇంతకీ అతనెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్.

Ileana: సెబాస్టియన్ ప్రేమలో ఇలియానా…
లారెన్ట్ మైఖేల్ తో ఇలియానా ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని, ఇలియానా ప్రెగ్నెన్సీ కి అతడే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వారి వాదనకు ఆధారంగా కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టారు. ఇటీవల విక్కీ కౌశల్-కత్రినా దంపతులు వెళ్ళిన మాల్దీవ్స్ వెకేషన్ కి వారి ఫ్రెండ్స్ తో పాటు ఇలియానా, సెబాస్టియన్ సైతం హాజరయ్యారు. మాల్దీవ్స్ వెకేషన్ కి సంబందించిన ఫొటోల్లో ఇలియానా సెబాస్టియన్ సన్నిహితంగా ఉండటం హైలెట్ . దీంతో లారెన్ట్ మైఖేల్ వల్లే ఇలియానా తల్లి కాబోతోందన్న వార్తలు బి – టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి.





























