YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ కట్టడాలు నిర్మించారు అంటూ ఇటీవల అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులో లోటస్ పాండ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ సెక్యూరిటీ కోసం ఇంటి ముందు ప్రత్యేకంగా కొన్ని గదులను నిర్మించారు.

ఆ గదులు రోడ్డుకు అడ్డంగా అక్రమ కట్టడాలను నిర్మించడంతో రహదారులలో ప్రయాణించడానికి ఇబ్బంది కరంగా మారింది. ఈ క్రమంలోనే అక్రమ కట్టడాలని గుర్తించిన జిహెచ్ఎంసి అధికారులు ఆఫ్ కట్టడాలను కూల్చివేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ ఆర్డర్లు వేసిన అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కూల్చి వేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు వేశారు ఆయనను సాధారణ పరిపాలన విభాగానికి అటాచ్ చేస్తూ జిహెచ్ఎంసి ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు ఇచ్చారు.
సస్పెన్షన్ వేటు..
అధికారులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి మూడు షెడ్లను కూల్చివేశారు. ఈ విధంగా అధికారి హేమంత్ ఏ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయకుండా ఇలా అక్రమంగా నిర్మించారని కూల్చివేయడం పట్ల ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.





























