Music Director Koti: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో దర్శకుడు కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు మెలోడీ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కోటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను సంగీతదర్శకుడిగా స్టార్ హీరోలందరికీ ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను అందించానని వెల్లడించారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారి సినిమాలు ప్రతి ఒకటి సూపర్ హిట్ అని ఈ సందర్భంగా వెల్లడించారు.చిరంజీవి సినిమాలు చేయాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది కానీ ఒకసారి ఆయన సినిమాలు చేశాను అంటే చాలా భయం పుడుతుందని కోటి వెల్లడించారు. చిరంజీవి సినిమా అంటే ప్రతి ఒక్క పాట హిట్ కావాలి. అలా హిట్ కావాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సినిమాలు చేయాలంటే నా వెన్నులో వణుకు పుడుతోందని కోటి తెలిపారు.

ఇక మోహన్ బాబుకు కూడా తాను ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించానని ఈ సందర్భంగా కోటి చెబుతూ వారిద్దరి మధ్య జరిగిన ఓ సన్నివేశం గురించి వెల్లడించారు. సాధారణంగా మోహన్ బాబుకి కోపం ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి మోహన్ బాబు పై కోటి గట్టిగా అరిచానని ఈ సందర్భంగా వెల్లడించారు.
మీరెవరు ప్యాకప్ చెప్పడానికి…
ఒక సినిమా షూటింగ్ కోసం పనిచేస్తున్న సమయంలో నేను ఏదో కోపంలో ఆర్కెస్ట్రా ప్యాకప్ అంటూ గట్టిగా అరిచాను. అంతలోగా మోహన్ బాబు కూడా కోపంగా వచ్చి ఆర్కెస్ట్రా ప్యాకప్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆర్కెస్ట్రా నాది నేను ప్యాకప్ చెప్పాలి మీరు ఎవరు ప్యాకప్ చెప్పడానికి… మీరెలా ప్యాకప్ చెబుతారు అంటూ గట్టిగా మోహన్ బాబు గారి పై అరిచానని ఈ సందర్భంగా కోటి తెలిపారు. ఇలా రెండు రోజుల వరకు మేము ఇద్దరం మాట్లాడుకోలేదని ఆ తర్వాత అంతా మామూలుగా జరిగిపోయిందని కోటి తెలియజేశారు.






























