Tabita-Sukumar: తెరపై ఎమోషన్లు పలికిండమే తప్పితే నిజజీవితంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పెద్దగా ఎమోషల్ అయిన దాఖలాలు లేవు. తాజాగా పుష్ప సక్సెస్ మీట్ లో మాత్రం ఎమోషనలో అయ్యాడు సుకుమార్. ఐకాన్ స్టార్ బన్నీ.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా పుష్ప విజయవంతంగా దూసుకుపోతోంది.

ఇప్పటికే రికార్డ్ స్ఠాయి కలెక్షన్లను రాబడుతోంది. ముక్యంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కూడా సినిమా సక్సెస్ అయింది. సినిమా విడుదలకు ముందే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ లో క్రేజీ బజ్ పెంచాయి.

తాజాగా.. పుష్ప సక్సెస్ మీట్ లతో చిత్ర యూనిట్ పాల్గొంటుంది. ఇలా ఓ కార్యక్రమంలో బన్నీ ఎమోషనల్ అయ్యాడు. సుకుమార్ లేకపోతే.. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ఇవ్వేవి లేవంటూ.. బన్నీ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు.
నీలాంటి భర్త దొరకడం నా భాగ్యం..
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ సుకుమార్ తన భార్యకు థాంక్స్ చెబుతూ.. మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. నన్ను భరిస్తున్నందవుకు తబితకు థాంక్స్. ఈ విజయంలో నాభార్య భాగస్వామ్యం కూడా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేశారు. దీనికి ప్రతీకగా.. భర్త సుకుమార్ పై ఎమోషన్ పోస్ట్ పెట్టింది తబిత. నా పేరుతోనే థాంక్యూని స్టార్ట్ చేసిన నా భర్త, నా సామీ సుకుమార్‌కి ఒక మాటతో మొదలు పెడతా.. నా ప్రాణం నువ్వు, నా సర్వం నువ్వు.. నా జీవం నువ్వు.. నీలాంటి బంగారం లాంటి మనిషికి భార్యని అయ్యే భాగ్యం దొరికినందుకు ఆ దేవుడికి మొదట థ్యాంక్స్ చెప్పాలి. ప్రతీ భార్య చాలా కలలు కంటుంది.. నిజానికి నా కలలు కొన్ని కలలుగానే మిగిలిపోయినా.. నీ కలనే నా కలగా మార్చేసుకున్నా ఈ జీవితానికి అంటూ పోస్ట్ పెట్టింది.
































