Kranthi Baliwada: క్రాంతి బలివాడు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించింది. పలు సీరియల్స్ కు ఆమె డబ్బింగ్ చెబుతున్న సమయంలోనే ఆమెకు సీరియల్స్ లో నటించడానికి ఆఫర్లు వచ్చాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తిరమైన అంశాలను ప్రస్తావించారు.

ఆమె ఏం మాట్లాడారంటే.. డబ్బింగ్ నుంచి .. ఆర్టిస్ట్ గా మారానని.. ఆర్టిస్టుగా చేస్తున్న సమయంలో నా వాయిస్ వేరే వాళ్లు చెప్పేవారన్నారు. తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని.. తన కెరీర్ లో చాలా మంది తనకు సపోర్టు చేశారన్నారు. ఇక సీరియల్స్ లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా.. సినిమాల్లో వాళ్లకు ఆఫర్లు రావని తెలిపారు.

అందుకే తాను చాలా రోజుల వరకు సీరియల్స్ లో నటించలేదని.. తర్వాత సినిమాల్లో ఆఫర్లు వచ్చాయన్నారు. ఇక తెలుగులో ఆర్టిస్టులకు చాలామంది ఆఫర్లు రావడం లేదని ఫీల్ అవుతున్నారని.. అయితే స్కిన్ షో చేయడానికి బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. అందుకే వాళ్లకు ఎక్కువగా ఆఫర్లు వస్తాయని అన్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ తనతో అన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
డబ్బింగ్ ఆర్టిస్టు కావడం వల్లనే..
ఇక ప్రకాష్ రాజ్ గురించి చెబుతూ.. అతడు అంటే ఎవరైనా బయపడతారని.. అతడికి తెలుగు బాగా అలవాటైపోయిందని అన్నారు. అందుకే అతడు డైలాగ్స్ సులువగా చెప్పగలడు అంటూ చెప్పారు. ఇక సీరియల్స్ లో యాక్ట్ చేసే సమయంలో ఎప్పుడూ భయంగా ఉంటుందని.. సీనియర్లతో చేసే సమయంలో షూటింగ్ షాట్ ఫెయిల్ కాకూడదనే టెన్షన్ ఉంటుందని అన్నారు. ఇక తాను డబ్బింగ్ ఆర్టిస్టు కావడం వల్ల డైలాగ్స్ బాగా గుర్తుంటాయని చెప్పుకొచ్చింది. ఇక కొన్ని సినిమాల్లోకి సీన్లు చేసే సమయంలో ఇంత కఠినంగా ఉంటాయా అని అనిపించిందన్నారు.

































