Imandi Ramarao : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదనాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా, గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక కృష్ణ గారి వారాసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ గారికి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. అలాగని కమర్షియల్ పంథాలో సినిమాలను కృష్ణ చేయలేదు. ఇక పద్మాలయ బ్యానర్ పెట్టి సినిమా నిర్మాణలోకి అడుగుపెట్టారు.

అప్పులపాలైన పద్మాలయా స్టూడియోస్…
సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ సినిమాలంటే కృష్ణ గారికి చాలా ఇష్టమని దానివల్లే పద్మాలయ అప్పుల్లోకి పోయింది అంటూ చెప్పారు. పద్మాలయ బ్యానర్ లో ఎపుడూ సినిమాల నిర్మాణం జరుగుతూనే ఉండేది. కృష్ణ గారి వద్ద చాలా రోజులుగా పనిచేస్తున్న టెక్నిషియన్స్ ఎవరైనా సినిమా తీస్తామని ముందుకొచ్చినా కృష్ణగారు తీసేవారు. డబ్బులు సెటిల్ అయ్యాకే సినిమా విడుదల అంటూ కృష్ణ గారు నాడు అనేవారు కాదు. దానివల్ల చాలా సందర్భాల్లో మధ్యవర్తిగా హామీగా ఉండి డబ్బులను నష్టపోయారు. దానివల్ల పద్మాలయ స్టూడియోస్ అప్పుల పాలై చివరికి సీజ్ వరకు వెళ్ళింది.

ఇక కృష్ణ గారి తమ్ముడు హనుమంతరావు గారు పద్మాలయ బ్యానర్ చూసుకునేవారు. అయితే అప్పుల పాలైన స్టూడియోస్ ను మళ్ళీ నిలబెట్టింది మహేష్ బాబు. తను సినిమాల్లోకి వచ్చాక అప్పులను మెల్లగా తీర్చుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. కృష్ణ గారు సినిమాల ద్వారా సంపాదించుకున్నది తక్కువ, ఆయన అందరిలా ఆస్తులను కూడబెట్టుకోలేక పోయారు అంటూ ఆయన గురించి ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
































