Imandi Ramarao : మెగా కాంపౌండ్ హీరోలు అనగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత అంత పాపులర్ అయిన హీరోలు బన్నీ, చెర్రీ నే. ఇక ఇందులో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి బిజినెస్ మ్యాన్. గత కొన్నేళ్లుగా బన్నీ సినిమాల తీరు వేరుగా ఉంది, మెగా నీడ నుండి పక్కకు వచ్చి సొంత ఫ్యాన్ బేస్ ను చేసుకున్నాడు బన్నీ. మెగా అభిమానులకు బన్నీ ఇష్టముండొచ్చు కానీ మెగా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా కొంతమంది బన్నీ ఫ్యాన్స్ ఉన్నవారు ఉన్నారు. ఇక బన్నీ మార్కెట్ ఏపీ తెలంగాణ మాత్రమే కాకుండా కేరళ, కర్ణాటక మరీ ముఖ్యంగా చాపకిందా నీరు లాగా నార్త్ లో పాకింది. ‘పుష్ప’ సినిమా ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండానే నార్త్ లో ఇరగదీసింది. ఈ విజయంతో బన్నీకి నార్త్ లో ఉన్న క్రేజ్ అర్థమైంది. ఇవన్నీ బన్నీ లో అహాన్ని పెంచాయనే అనుమానాలను అందరిలో రేకెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో అల్లు అర్జున తీరు అలానే అనుకునేలా ఉండటం దీనికి కారణం. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు విశ్లేషించారు.

రామ్ చరణ్ ను కావాలనే మాట్లాడనివ్వలేదా…
అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో చిరంజీవి మాట్లాడారు, చాలా సరదాగా అల్లు రామలింగయ్య గారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఇక అల్లు రామలింగయ్య గారి మనవడిగా అల్లు అర్జున్ కూడా మాట్లాడారు. అయితే ఇటు కూతురు కొడుకుగా రామ్ చరణ్ కూడా అల్లు రామలింగయ్య గారి మనవడే కానీ ఆయన మాట్లాడలేదు. ఆయనను కావాలనే మాట్లాడనివ్వలేదా లేక రామ్ చరణ్ మాట్లాడలేదా అనే విషయం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ మెగాస్టార్ కాంపౌండ్ కి దూరం జరగాలని తన సొంత ఇమేజ్ తో ఎదగాలని ప్రయత్నిస్తున్నట్లు బాగా తెలుస్తోందంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

అల్లు రామలింగయ్య గారి అల్లుడు గా కంటే మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఆయనకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇక ఆయన తరువాత పూర్తిగా ఆ వేడుకను అల్లు కుటుంబం వ్యవహారంగా అల్లు అర్జున్ మార్చేసాడు అందుకే రామ్ చరణ్ ను మాట్లాడనివ్వలేదు. చిరంజీవి గారి తరువాత వేడుకలో అల్లు ఫ్యామిలీ ఫోకస్ అయ్యేలా చూసుకున్నారు. భవిష్యత్తులో కొణిదెల ఫ్యామిలీ నీడ నుండి బయటకు రావడానికి ప్రణాళిక చేస్తున్నట్లుగా బన్నీ తీరు ఉందని ఇమంది గారు అభిప్రాయపడ్డారు.


































