బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో షణ్ముఖ్ , సిరి వ్యవహారం మామూలుగా లేదు. వీరిద్దరు తెగ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోతూ బిగ్‌బాస్‌కు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు అలకలు, కోపాలు.. ఆ తర్వాత ముద్దు ముచ్చట్లు.. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో బీభత్సమైన టాక్ నడుస్తోంది.

మొన్నటికి మొన్న సిరి.. షణ్ముఖ్ కు ముద్దు పెట్టిందని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. దానికి వారు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామని మాత్రమే చెబుతున్నారు. దానికి నాగార్జున ఇద్దరిని కన్పెషన్ రూంకి రప్పించి ఏం జరుగుతోంది అంటూ సున్నితంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మొన్న షణ్ణుకు సిరి ఏకంగా లిప్ లాక్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరిగిన నేపథ్యంలో ఇలా వాళ్లను అడిగినట్లు తెలుస్తోంది.
దానికి సిరి.. తాను బాగా కనెక్ట్ అయిపోయానని.. అది బయట ఏ రకంగా తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ సిరి చెప్పిన విషయం తెలిసిందే. తర్వాత షణ్ముఖ్ కూడా తన ప్రవర్తనలో మార్పు వస్తుంది నాగార్జున సార్ అంటూ ప్రామిస్ కూడా చేశాడు. తర్వాత ఒక రోజు బాగానే ఉన్నారు. తర్వాత మళ్లీ మొదలు పెట్టేశారు. నిన్న జరిగిన ఎపిసోడ్ మళ్లీ బెడ్ పైనే హగ్ చేసుకున్నారు. రాత్రి పడుకునే సమయంలో సిరికి ఏమౌతుందో ఏమో గానీ.. బెడ్ పై షణ్ముఖ్ ఉండగా.. వెళ్లి ఐ యామ్ సారీ అంటూ చెప్పి.. మళ్లీ హగ్గుల వర్షం కురిపించింది.
ఇలా మళ్లీ వాళ్లిద్దరు రొమాన్స్ చేసుకుంటుండగా.. చూసిన సన్నీ షాకవుతాడు. ఆ సీన్లను ఎక్కువగా బిగ్ బాస్ చూపించలేదు కానీ.. వాళ్ల రొమాన్స్ తారాస్థాయికి చేరుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫ్యామిలీతో పాటు చూసే ఈ షోలో ఇలాంటివి ఉండటం.. కొంతమందకి నచ్చడం లేదు. ప్యామిలీ మెంబర్స్ చూడలేకపోతున్నారంటూ సిరి, షణ్ముఖ్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
































