Crime News నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని మెట్టు మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి విగ్రహం పాదాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మొండెం లోని తలను స్థానికులు గుర్తించారు.

ఈ ఇన్సిడెంట్ కాలనీలో భయాందోళనలు రేపింది. మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరుచేసిన తలను వదిలి వెళ్లారు దుండగులు. దీంతో ఆ ప్రాంతమంతా ఈ ఘటన పెద్ద కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

బాధితులు ఎవరో ఇంకా గుర్తు పట్టలేదు. కానీ అతని వయస్సు దాదాపు 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. ఇది నరబలి కేసు అయి ఉండొచ్చని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వ్యక్తిని హత్య చేసి తలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..
హత్యా చేశారా.. ఆత్మహత్య చేసుకున్నారా ..?
వివాహేతర సంబంధంపై కొద్ది రోజుల క్రితం సంఘటనా స్థలానికి సమీపంలోని కుర్మేడు వద్ద పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కూలీల మధ్య ఘర్షణ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక దీనిపై స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతర శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. అసలు ఇది ఎలా జరిగింది.. హత్యా చేశారా.. ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.































