Pushpa Movie: పుష్ప సినిమా మొత్తం చిత్తూరు యాసలో సాగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాకున్నా.. యాస విషయంలో అద్భుతంగా పలికారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు అమ్మ క్యారెక్టర్ చేసిన కల్పలత మీడియా సమావేశంలో కొన్ని విషయాలను పంచుకున్నారు.

ఆమె మాట్లాడుతూ.. హీరోకు అమ్మగా చేయడం అంటే అదృష్టం ఉండాలని.. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి.. అవకాశం రావాలే గానీ అలాంటి టాప్ హీరోలకు అత్తగా, అమ్మగా చేయడానికి ఆర్టిస్టులు క్యూ కడతారు అని చెప్పారు. ఆడిషన్‌కి ఎంతో మంది వచ్చారని.. నాకంటే కూడా బాగా చేసిన వాళ్లు ఉన్నారని.. అక్కడ మదర్ క్యారెక్టర్ కు సంబంధించి ఆడిషన్ ఇచ్చేసి ఇంటికి వెళ్లాను అని చెప్పింది.

Pushpa Movie : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన కల్పలత..
తర్వాత 6 నెలలకు ఫోన్ వచ్చిందని.. పుష్ప సినిమాలో అమ్మ క్యారెక్టర్ కు మీరు సలెక్ట్ అయ్యారనగానే.. నాకు కన్నీళ్లు ఆగలేదని చెప్పొకొచ్చింది కల్పలత. ఈ సినిమా చేసిన తరువాత సుకుమార్ నాకు అమ్మగా, అల్లు అర్జున్ కొడుకుగా అనిపించారని సంతోషంతో చెప్పుకొచ్చారు లత. తాను ఎన్నో సినిమాల్లో నటించానని.. కానీ ఇంత పెద్ద గుర్తింపు రాలేదన్నారు. ప్రతీ ఒక్కరూ తనకు ఫోన్ చేసి.. బాగా నటించావు అని అనగానే ఎంతో సంతోషం వేసిందని చెప్పుకొచ్చారు.

పుష్ప రెండో భాగం ఇంకా బాగుంటుందని చెప్పారు. ఇక ప్రస్తుతం ఆమె గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఆమెది ఖమ్మం జిల్లా మణుగూరు. వ్యవసాయదారుల ఫ్యామిలీ.. బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటున్న సమయంలో సినిమాల్లో, సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. అలా ఆమె సినిమాల్లోకి వచ్చేసింది. చివరకు పుష్పలో మంచి క్యారెక్టర్ తో ఆమె పేరు ఇప్పుడు మర్మోగిపోతోంది.
































