Inaya Sultana: ఇనయా సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఇటీవల హీరోయిన్ గా శివం భజే అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

నటుడు అశ్విన్ ఇనయా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధుల నుంచి నటి ఇనయాకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈమె గత కొద్ది రోజుల క్రితం తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే విషయం గురించి రిపోర్టర్ ప్రశ్నిస్తూ మీరు కథ కొద్ది రోజుల క్రితం మీ బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసారు అయితే ఒక ఒక యాక్సిడెంట్ జరిగిన సమయంలో తాను ఒక వ్యక్తిని కాపాడారని చెప్పారు. ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వమని కోరారు. ఇలా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మూవీ చూసి వస్తున్నాము రాత్రి 2 గంటల సమయం అయింది.
మూడు రోజులకు చనిపోయారు..
ఆ సమయంలో వర్షం పడుతుండగా ఒక వ్యక్తి స్కూటీలో స్కిడ్ అయ్యి కింద పడిపోయారు. అప్పటికే ఆయన బాడీలో ఒకవైపు ఆర్గాన్స్ మొత్తం బయటకు వచ్చాయి. ఇక తన బాయ్ ఫ్రెండ్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి కావడంతో ఆ అంబులెన్స్ వచ్చేవరకు తనని ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇక తనని హాస్పిటల్లో చేర్చిన తర్వాత మూడు రోజులకు చనిపోయారు అంటూ ఆ ఘటనని తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు..



























