Inaya Sulthana: ఇనయ సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన డాన్స్ తో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు. ఇదే పాపులారిటీతో ఇనయ సుల్తానా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా 14 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఈమె ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు.

ఇనయ సుల్తానా మొదటినుంచి ప్రతి ఒక్క టాస్క్ లోను ఎంతో అద్భుతంగా తన ఆట తీరును కనబరుస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే టైటిల్ రేస్ లో ఉంటుందని భావించినటువంటి ఈమె ఉన్నఫలంగా ఎలిమినేట్ కావడంతో ఉద్దేశపూర్వకంగానే ఈమెని ఎలిమినేట్ చేశారంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.మొత్తానికి 14 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఈమె ఎలిమినేట్ అయ్యారు.
ఇనయ సుల్తానా ఎలిమినేట్ అనంతరం పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ బిగ్ బాస్ గురించి తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఈమె పెళ్లికూతురులా ముస్తాబయి ఒక వ్యక్తి పక్కన నిలబడి ఉన్నటువంటి ఫోటో వైరల్ అవుతుంది. ఈమె పక్కన తన తల్లి కూడా ఉండడం విశేషం.

Inaya Sulthana: ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇలా చేస్తున్నారు…
ఇది చూసినటువంటి ఎంతోమంది ఇనయ సుల్తానాకు ఇదివరకే పెళ్లి జరిగిందా..ఈమె ఎవరిని వివాహం చేసుకున్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు పెళ్లి కాలేదని కావాలని కొందరు ఇలాంటివి చిత్రీకరిస్తున్నారట అభిమానులు ఈ ఫోటో పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






























