KGF 3: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 2ఏప్రిల్ 14వ తేదీ విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను రాబట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో ప్రస్తుతం ప్రశాంత్ నీల్, యశ్,సంజయ్ దత్, రవీనా టాండన్ పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. వీరితో పాటు కేజిఎఫ్ సినిమా లో మరొక కీలకమైన పాత్ర కూడా ఉంది అదే ఇనాయత్ ఖలీల్.

కే జి ఎఫ్ సినిమా కథ మొత్తం కీలక మలుపు తిరిగే పాత్ర అయినటువంటి పాత్రలో నటించింది మన తెలుగు వారే.టాలీవుడ్ కి చెందిన ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్రల్లో నటించారు. ఈయన మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కేజిఎఫ్ చాప్టర్ 2 చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చాప్టర్ 3 ఉంటుందనీ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఆయనని ప్రశ్నిస్తూ కేజిఎఫ్ చాప్టర్ 2 లో విలన్స్ అందరూ చనిపోయారు ఇక మిగిలింది ఇనాయత్ ఖలీల్ మాత్రమే… సో చాప్టర్ 3 లో మీరే మెయిన్ విలన్ కదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
కాంట్రవర్సీలోకి లాగకండి…
అలాంటివేమీ నాకు తెలియదు దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగకండి చాప్టర్ 2 చివరిలో కేజీఎఫ్ చాప్టర్ 3 అన్నది నాకు సరిగ్గా కనబడలేదు. నిజంగానే నాకు కనిపించలేదా? లేక మీరు ఇమేజిన్ చేసుకున్నారా? అనే సందేహం కలుగుతుంది అంటూ ఈయన సమాధానం చెప్పారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారు. మరి కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందా లేదా అనే విషయం గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

































