దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటన్‌లో భారీగా కేసుల తగ్గుదల కనిపించింది. తాజా నివేదిక ప్రకారం 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది 147 రోజుల కనిష్టం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 3,88,508 ఉన్నాయి. ఇక రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని నివేదక తేలిపింది.

గడిచిన 24 గంటల్లో 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మెుత్తంగా 3,11,80,968 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో వ్యాక్సిన్ పక్రియ కూడా ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 51.45కోట్ల డోసులు పంపిణీ జరిగింది.































