డిగ్రీ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్.. ఎస్ఎస్‌సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..?

0
85

ఇండియన్ ఆర్మీకి చెందిన షార్ట్ సర్వీస్ కమిషన్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఎస్ఎస్‌సీ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఉద్యోగాల భర్తీ జరగనుంది. 2020 సంవత్సరం డిసెంబర్ నెల 30వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 28వ తేదీ ఉద్యోగ ఖాళీల భర్తీకి చివరి తేదీగా ఉంది.

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారితో పాటు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిగ్రీ పాస్ కావడంతో పాటు ఎన్‌సీసీ ‘సీ’ స‌ర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. :https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

2021 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నాటికి 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి చివరిగా మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బంది ఎన్‌సీసీ ‌సీ సర్టిఫికెట్ లేకపోయినా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. మొత్తం 55 ఉద్యోగ ఖాళీలలో ఎన్‌సీసీ మెన్ ఉద్యోగాలు 50 ఉండగా ఎన్‌సీసీ విమెన్‌ ఉద్యోగాలు 5 ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here