కరోనా కారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ (INET) లేకుండా పోస్టులు ఇంటర్వ్యూ ద్వారా పోస్టులని భర్తీ చేయనున్నారు.

ముఖ్యంశాలు:
ఇండియన్ నేవీ జాబ్ నోటిఫికేషన్
ఎలక్ట్రికల్ విభాగంలో 40 ఖాళీలు
ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులు
జులై 30 దరఖాస్తులకు చివరితేది
నేవీలో ఖాళీల భర్తీకి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) మార్కుల ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఈ పోస్టులకు అవివాహిత పురుషు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎలక్ట్రానిక్ బ్రాంచ్‌లో కోర్సు 2022 జనవరిలో ప్రారంభం అవుతుంది. మొత్తం 40 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్హతలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీఈ లేదా బీటెక్ పాసై ఉండాలి
వయస్సు: 1997 జనవరి 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ జరిగే స్థలం: విశాఖపట్నం, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్

































