బీమా రంగం ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏజెంట్ల నుంచి ఆఫీసర్ స్థాయి వరకు భారీ స్థాయిలోనే నియామక ప్రక్రియలు చేపడుతున్నారు. ఈ కోవలోనే ప్రైవేట్ లైఫ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ అయిన మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారీగా ఉద్యోగాలను నియమించుకోనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాక్స్ లైఫ్ వెల్లడించింది. నియామక ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలో చేస్తామని కంపెనీ ప్రకటించింది.

డిజిటల్ రిక్రూట్‌మెంట్ ప్రయాణం మా ఏజెన్సీలో అత్యున్నత నాణ్యత, ప్రతిభగల వారిని నియమించుకోవడానికి ఉపయోగపడుతుందని.. అంతే కాకుండా చురుగ్గా, వేగంగా, ప్రభావవంతంగా నియామక ప్రక్రియ చేపట్టడానికి కూడా ఉపయోగపడిందని మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి విశ్వనాద్ తెలిపారు. డిజిటల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 2021 సంవత్సరానికి 23,000 మంది ఏజెంట్ అడ్వైజర్లను నియమించుకోనుంది.
డిజిటల్ నియామక ప్రక్రియ కింద మాక్స్ లైఫ్ నాణ్యమైన ఏజెంట్ నియామకాన్ని ప్రారంభించడానికి సమగ్రమైన ‘వెబ్-టు-రిక్రూట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. దీంతో పాటు కొత్త ట్రైనింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ ‘మ్యాక్స్ లైఫ్ ఏస్ టాక్’ ప్రారంభించింది. ఇందులో మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ ఏజెంట్ అడ్వైజర్ల స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయని తెలిపారు.
ఇదిలా ఉండగా.. గతేడాది నుంచి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇన్సురెన్స్ తీసుకోవాలనే ఆలోచన ప్రతీ ఒక్కరికీ అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలతో పాటు టర్మ్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. బిజినెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ నయామకాల ప్రక్రియ కూడా వేగంగా పుంజుకుంటోంది. ఇది నిరుద్యోగులకు ఒక శుభవార్త లాంటిది.



























