Athadu : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు త్రిష కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం అతడు. నిజం, నాని,అర్జున్ వంటి వరుస ప్లాప్ సినిమాలను చవిచూసిన మహేష్ బాబుకు అతడు సినిమా కాస్త ఊరట కలిగించింది. అతడు సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను నంది పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది.

ప్రేక్షకుల ముందుకు వచ్చి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథను ముందుగా మహేష్ బాబుకి కాకుండా పవన్ కళ్యాణ్ కి వినిపించారట. ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కు చెప్పడం మొదలుపెట్టిన కొంత సమయానికే పవన్ కళ్యాణ్ నిద్రలోకి జారుకుని తర్వాత నిద్ర లేచి ఈ సినిమా కథ నాకు నచ్చలేదని చెప్పారట.

ఇలా సినిమా కథ నచ్చలేదని చెప్పడంతో వెంటనే త్రివిక్రమ్ మహేష్ బాబు వద్దకు వెళ్లారు. ఆయన ఈ సినిమా కథను చాలా శ్రద్ధగా విని తనకు బాగా నచ్చిందని వెంటనే ఈ సినిమా చేద్దామని చెప్పారు. ఇక ఈ సినిమా మురళి మోహన్ సమర్పణలో తెరకెక్కి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయింది.
బ్లాంక్ చెక్ వెనక్కి పంపిన శోభన్ బాబు..
ఇక ఇదే విషయాన్ని త్రివిక్రమ్ పలు సందర్భాలలో వెల్లడించారు అంతేకాకుండా ఈ సినిమాలో సత్యనారాయణ పాత్రలో నాజర్ నటించిన సంగతి తెలిసిందే . అయితే మురళి మోహన్ ఈ పాత్రలో నటించడం కోసం ముందుగా నటుడు శోభన్ బాబుని అనుకున్నారట అందుకోసం శోభన్ బాబుకు బ్లాంక్ చెక్కు పంపించిన ఆయన తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే ఆసక్తి లేదని రిజెక్ట్ చేయడంతో నాజర్ ఆ పాత్రలో నటించారు.



























