హీరో హరీష్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఏంటో తెలుసా ? అయన ఫ్యామిలీని చూసారా?

0
13672

చాలా తక్కువ మందికి మాత్రమే సినీ రంగంలో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అదృష్టం కలిసి వస్తనే సినీ ఇండస్ట్రీలో కొనసాగడానికి రాసిపెట్టి ఉంటుంది. భారతదేశంలోని చిత్రపరిశ్రమలో ఎందరో హీరోలు, హీరోయిన్లు విజయాలు అందుకున్న కూడా కేవలం నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత వారు మళ్ళీ వెండితెరపై కనిపించరు. దీనికి కారణం వారి జీవితంలో జరిగే వివిధ సంఘటనలే. అసలు విషయంలోకి వెళితే… చాలామంది బాలనటులుగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించినా కూడా.. ఆ తర్వాత పెద్దగా అయ్యాక హీరోయిజం చూపించడంలో మాత్రం ఫెయిల్ అవ్వడంతో చివరికి సినిమాల నుండి వైతొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి లిస్టులో మనం ముందుగా చెప్పుకోవాల్సిన వారు ఎవరు అంటే హీరో హరీష్. ఈయన 1975లో హైదరాబాద్ లో జన్మించారు. ఈయన చిన్నప్పుడు నుంచి సినిమాల్లో బాల నటుడిగా వివిధ పాత్రలలో నటించి అనతికాలంలోనే తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు. హరీష్ కేవలం దక్షిణ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేశాడు. మొత్తం ఐదు భాషల్లో నటించిన బాల నటుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ హరీష్ ను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు అంటే ఆయన నటించిన సినిమాలను చెప్పేవారు ఎందరో. ఈయన 1983లో ఆంధ్రకేసరి సినిమాతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డును అందుకున్నాడు. చిన్నప్పట్నుంచే హరీష్ కు మంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తన సినీ నేపథ్యంలో ఏకంగా 280 సినిమాలలో నటించాడు. హరీష్ చాలా సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకు రావాల్సినంత గుర్తింపు మాత్రం లభించలేదు.

ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమఖైదీ అనే సినిమాతో హీరోగా పరిచయం అవ్వగా అదే సినిమాను బాలీవుడ్ లో సైతం విడుదల చేశారు. ఈ సినిమా ఇక్కడ అక్కడ అ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాను ఆదర్శంగా తీసుకొని అప్పట్లో చాలామంది ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఒక రూమర్ కూడా ఉంది. ఆ సినిమాలో బాలీవుడ్ లో హీరో హరీష్ పక్కన కరిష్మా కపూర్ హీరోయిన్ గా నటించి ప్రస్తుతం ఆవిడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత హరీష్ కు అమ్మాయిలలో మరింత క్రేజ్ వచ్చింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హరీష్ నటించిన ఆహనా పెళ్ళంట అనే సినిమాకు ఏకంగా ప్రత్యేక జ్యూరీ పురస్కారాలు అందుకున్నాడు. అయినా సరే ఆ తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు లభించలేదు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో 2007లో వచ్చిన పెళ్లయింది కానీ.. అనే సినిమానే చివరిది. అయితే ఈయన 2018లో ఆగయ హీరో సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమాలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మరి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో మళ్లీ నిర్మాణ రంగం వైపు రాలేదు.

ఇది ఇలా ఉండగా తన సినీ జీవితం విఫలం కారణం ఏదైనా ఉంది అని అడుగగా తాను దక్షిణ భారతదేశంలో హీరోగా సెటిల్ అవుతున్న సమయంలో చాలామంది తాను హిందీలో ప్రయత్నిస్తే బాగుంటుంది అని, తనలో బాలీవుడ్ లుక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో తాను దక్షినాది సినీ పరిశ్రమను వదిలి బాలీవుడ్లో ప్రయత్నించగా.. ఒకవైపు దక్షిణ భారతదేశంలో మరోవైపు ఉత్తర భారతదేశంలో రెండు చోట్ల తనకు కలిసి రాలేదని చెప్పేవారు. ఈయన సినిమాల్లో హీరోగా నటిస్తున్న సమయంలో ని ముంబై నగరంలోని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. తన కొడుకుని ఇప్పటి నుంచే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అయితే ప్రస్తుతం ఆయన కుటుంబ వ్యాపారం చేసుకుంటూ ఉన్న కానీ తన ప్రాణం తన బిజినెస్ అంతా సినిమానే అని ఎప్పటికైనా తాను దర్శకుడిగా మారి సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు ఇదివరకు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన కుటుంబ వ్యాపారం చేస్తున్నప్పటికీ తన మొదటి ప్రాముఖ్యత సినిమానే అని చెబుతారు. ఇటీవల ఆగస్టు 7, 2021 న హరీష్ నాన్నగారు కే.వి. చలంగారు మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here