మద్యపానం మాన్పించడం ప్రభుత్వంతో కానిది ఈ సినిమాతో అయ్యిందంటే ఆశ్చర్యపోతారు.?!

0
470

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ అనేక విజయవంతమైన సినిమాలు తీస్తూ.. డా.రాజశేఖర్ తో ‘అంగరక్షకుడు’ అనే సినిమా కోసం కె.ఎస్.రామారావు కేరళ వెళ్లడం జరిగింది. అక్కడ ఒక నిర్మాత అప్పుడే విడుదలైన ఒక సినిమా గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించాడు.

ఇంతకీ ఆ సినిమా ఏమిటని కె.ఎస్.రామారావు ఆరా తీయగా అలనాటి నటి మాధవి ప్రధాన పాత్రలో “ఆకాశ దూదు” అనే మలయాళ చిత్రం అని తెలిసింది. ఆ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయిన కే.ఎస్.రామారావు లక్షా 75 వేల రూపాయల కు ఆ సినిమా రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.
అంతకుముందు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో పనిచేసిన డైరెక్టర్ అజయ్ నే తెలుగులో తీయబోయే రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

అలాగే సినిమాలో హీరోయిన్ గా ముందుగా జయసుధను అనుకున్నప్పటికీ ఆమె ఇలాంటి సినిమాలు ఎన్నో చేసి ఉండడంతో ఫ్రెష్ లుక్ కోసం మలయాళం ఒరిజినల్ చిత్రంలో వేసిన మాధవిని ఈ సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. మాధవికి భర్తగా నాజర్ నటించారు.

ఈ సినిమాలో సెంటిమెంటు డోస్ ఎక్కువగా ఉండడంతో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దర్శక నిర్మాతలు సినిమా టికెట్ తో పాటుగా కర్చీఫ్ అందించడం జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో వేటూరి రాసిన “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే” అనే పాటకు జాతీయ అవార్డు వచ్చింది.

కేవలం 25 లక్షల రూపాయలతో తీసిన ‘మాతృదేవోభవ’ చిత్రం దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా నంది అవార్డు ఫంక్షన్ లో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ మద్యపానం మానండని ప్రభుత్వం ఎన్ని యాడ్స్ చేసిన మారని ప్రజలు ‘మాతృదేవోభవ’ సినిమాతో ఆ మార్పు తీసుకొచ్చారని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here