పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరహర వీరమల్లు” అనే సినిమా తెరకెక్కుతోంది. అదేవిధంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో కూడా మలయాళ సూపర్ హిట్ చిత్రమైన “అయ్యప్పన్ కోషియమ్” చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు, రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది వరకు ఈ సినిమా గురించి ఎన్నో అప్డేట్స్ ప్రకటించిన చిత్రబృందం తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఏంటి అనే విషయాన్ని కూడా బయట పెట్టినట్టు తెలుస్తోంది.ఈ సినిమాకు “భీమ్లా నాయక్”అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా రానా కూడా ఒక పవర్ ఫుల్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” అనే పాత్రలో నటించడం వల్ల ఈ సినిమాకి కూడా “భీమ్లానాయక్” అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇంతకు ముందే ఈ సినిమాకు “పరుశురామ కృష్ణమూర్తి”అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి చిత్రబృందం ఈ సినిమాకు వీటిలో ఏ టైటిల్ ఎంపిక చేసుకుంటారో లేఖ మరో టైటిల్ కోసం ప్రయత్నిస్తారో తెలియాల్సి ఉంది.
































