ఒకే సంవత్సరంలో ఈ ముగ్గిరి హీరోల చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్.. కానీ వెంకటేష్ మాత్రం‌ అలా ఉండిపోవాల్సివచ్చింది.!!

0
1827

విజయవంతమైన చిత్రం రూపొందించాలంటే చక్కటి కథ, ఉత్తమమైన సంగీతం, మంచి దర్శకుడు, అభిరుచిగల నిర్మాత తోడయితే ఒక అద్భుతమైన చిత్రం రూపొందుతోంది. హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఎన్నో చూసాం.. కానీ ఒక సంవత్సరంలో ఒక ఇండస్ట్రీ హిట్ సర్వసాధారణం. అలాంటిది ఒకే సంవత్సరంలో మూడు ఇండస్ట్రీ హిట్ అనేది ఒక రేర్ ఫీట్. 1980 ద్వితీయార్థంలో ఎన్టీఆర్,కృష్ణ,శోభన్ బాబు కృష్ణంరాజు లాంటి హీరోల సినిమాలు తగ్గడం ప్రారంభించాయి.

ఈ దశకంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోల ప్రాబల్యం పెరిగింది. ప్రతి సంవత్సరం ఈ నలుగురు అగ్ర హీరోలలోఎవరిదో ఒకరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా ఉండేది. కానీ 1989 సంవత్సరం వచ్చేసరికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలువగా వెంకటేష్ సినిమాలు పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. హీరో నాగార్జున కొత్త దర్శకులకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు. అలా ఎలాంటి అనుభవం లేనటువంటి రాంగోపాల్ వర్మకి నాగార్జున తన సినిమాలో అవకాశం కల్పించారు.

1989 అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని వెంకట్ నిర్మాణం, శివ సినిమాలో నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా నటించారు. రచయిత తనికెళ్ల భరణి, అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు, ఎస్.గోపాల్ రెడ్డి లాంటి వారందరికీ సినిమాపై పెద్దగా నమ్మకం లేదు. అలాంటి సందేహాల మధ్య విడుదలైన శివ చిత్రం. 22 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 5.8 కోట్ల షేర్ వసూలు చేసి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ సంవత్సరం విడుదల అయిన చిత్రాలలో శివ చిత్రమే టాప్ వన్ లో నిలిచింది.

భార్గవ్ ఆర్ట్స్, గోపాల్ రెడ్డి నిర్మాణం, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘ముద్దుల మావయ్య’ చిత్రం విడుదలైంది. అన్నా చెల్లెలి సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం 28కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శింపబడి 5.5 కోట్ల షేర్ వసూలు చేసింది.

అల్లు అరవింద్ నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అత్తా అల్లుళ్ళ సవాల్, ప్రతిసవాళ్లతో కూడిన కథతో వచ్చిన ఈ సినిమా 14 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి, 5.2 కోట్లు వసూలు చేసింది.

ఇలా ఈ మూడు చిత్రాలు 1989 సంవత్సరంలో ఇండస్ట్రీ హిట్ గా నిలువగా.. ఒంటరిపోరాటం, టూ టౌన్ రౌడి చిత్రాల పరాజయంతో వెంకటేష్ వెనుకంజలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here