Actress Kasturi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నారు.

ఇలా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు సామాజిక అంశాలపై స్పందిస్తే తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్ అండర్ వేర్ ప్రకటనపై ఈమె స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.సాధారణంగా బాగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లు ఇలాంటి ఆడ్ చేయడానికి ఇష్టపడరు. కానీ రాహుల్ మాత్రం ఈ యాడ్ లో నటించారు.

ఈ సందర్భంగా కె.ఎల్.రాహుల్ అండర్ వేర్ యాడ్ ఫై కస్తూరి స్పందిస్తూ.. తాను ఇప్పటివరకు క్రికెటర్లు మాములుగా కోలాలు, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ఇతర ప్రముఖ బ్రాండ్లకు ఎండార్స్ చేయడమే చూశాను.. కానీ ఇలా లోదుస్తుల గురించి ప్రచారం చేయడం ఎప్పుడూ చూడలేదు. కానీ రాహుల్ మాత్రం ఏ విధమైనటువంటి బెరుకు లేకుండా ఇలాంటి యాడ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. రాహుల్ ఇలా బాక్సర్ లా చూడటం బాగుంది అంటూ ఈమె ద్వారా కె.ఎల్.రాహుల్ అండర్ వేర్ యాడ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

వెల్లువెత్తిన విమర్శలు…
ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె ఈ యాడ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ కస్తూరిని విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా, ఇలా సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
































