Actress Samyuktha: తెలుగు సినిమాలలో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు ఎంతో సూపర్ హిట్ అయ్యాయి.ప్రస్తుతం కాకుండా గత కొంతకాలం నుంచి సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతగానో ఎమోషనల్ టచ్ చేశాయని చెప్పాలి. ఇలా చెల్లెలు సెంటిమెంట్ తో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి గుర్తింపు పొందాయి. ఈ క్రమంలోనే చెల్లెలి పాత్రలో నటించిన వారు కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందారు.

ఇకపోతే చెల్లెలు పాత్రలు అనగానే గతంలో అందరికీ టక్కన గుర్తొచ్చే నటి సంయుక్త.చెల్లెల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె గత ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈమె అగ్ర హీరోలు అందరికీ చెల్లెలు పాత్రల ద్వారా నటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ, న్యాయం, స్వయంకృషి, మీరే చెప్పాలి వంటి సినిమాలలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఈమెకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ విధంగా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు. ఇకపోతే ఈమె నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమయంలోనే సినిమాటోగ్రాఫర్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
బుల్లితెర సీరియల్స్ ద్వారా బిజీగా ఉన్న సంయుక్త..
ఇకపోతే ఈ దంపతులకు కుమారుడు అర్జున్ కూతురు జనని ఉన్నారు. ఇప్పటికే సంయుక్త కుమారుడు అర్జున్ తమిళంలో ఇండస్ట్రీలోకి పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ వెండితెరపై కాకుండా బుల్లితెర సీరియల్స్ లో చేస్తూ బిజీగా ఉన్నారు.































