పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ, గులేబకావళి కథ, వరకట్నం, శ్రీకృష్ణసత్య లాంటి చిత్రాలను తీసిన టి.త్రివిక్రమరావు దాదాపు బాలకృష్ణతో ఐదు సంవత్సరాల నుంచి ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నప్పుడు కొండవీటి సింహంలో ఎన్టీ.రామారావు వేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రని బేస్ చేసుకొని పుష్పానంద్ ఒక కథ రాయడం జరిగింది. అది బాలకృష్ణ బి.గోపాల్ కు బాగా నచ్చడంతో త్రివిక్రమరావు తన విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 1991లో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.

ఇంతకుముందు లారీడ్రైవర్ సినిమాకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకి పనిచేశారు. ముందుగా ఈ సినిమాకు రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం రెండు టైటిల్స్ అనుకోని పెండింగులో పెట్టారు. కథలోని బాలకృష్ణ అగ్రెసివ్ క్యారెక్టర్ ఆధారంగా రౌడీ ఇన్స్పెక్టర్ టైటిల్‌ను పరుచూరి బ్రదర్స్ సూచించడం జరిగింది. అంతకుముందే కర్తవ్యం సినిమాలో విజయశాంతికి మంచి పేరు రావడంతో ఆమెనే రౌడీఇన్స్పెక్టర్ సినిమాలో బుక్ చేసుకోవడం జరిగింది. విజయశాంతికి హీరోలతో సమానంగా ఇమేజ్ రావడం వలన ఈ సినిమాలో బాలకృష్ణ కున్నంత ప్రాధాన్యత విజయశాంతికి ఇవ్వడం జరిగింది.
రైటర్ పుష్పానంద్ ఇచ్చిన స్టోరీ కి పరుచూరి బ్రదర్స్ ఊటీలో బి.గోపాల్ తో కలిసి డైలాగ్స్ రాయడం జరిగింది. నేను బొబ్బర్లంక రామబ్రహ్మంని కోపం వస్తే శ్రీలంక రావణబ్రహ్మనవుతా.. నీకు ఆగ్రహం వస్తే రెచ్చకొడతావు.. నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చితగొడతా.. అనే హీరో, విలన్ వీరోచిత సంభాషణలు ప్రేక్షకులను విస్మయులను చేస్తాయి. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి చక్రవర్తిని అనుకోగా అప్పటికే బి.గోపాల్ బప్పిలహరితో బ్రహ్మ సినిమాని తీస్తున్నారు. కావున ఈ సినిమాకి కూడా బప్పిలహరినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.

అయితే లారీ డ్రైవర్ సినిమాకి పనిచేసిన యూనిట్ ఈ సినిమా కూడా పనిచేశారు. తరవాత పరుచూరి బ్రదర్స్ తమిళంలో హిట్ అయిన చిన్న తంబి (చంటి) సినిమాని తెలుగులో రీమేక్ చేద్దాం అని బాలకృష్ణతో చెప్పడంతో ఆయన ఆ రీమేక్ మూవీని రిజెక్ట్ చేయడం జరిగింది. అలా లారీడ్రైవర్ సినిమాకి కథ అందించిన పుష్పానంద్ ఈ సినిమాకి కథ ఇవ్వడంతో రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ 1992 మే 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.































