మనం నిజ జీవితంలో కొందరి జీవితాలను ఇంకొకరి జీవితాలతో పోలుస్తూ ఉండం గమనిస్తూనే ఉంటాం. అసలు ఒక మనిషికి మరో మనిషికి ఎక్కడా కూడా సంబంధం లేకపోయినా సరే వారి జీవితాలు ఒకేలా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.

దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, అలాగే యాక్షన్ హీరో అర్జున్ భార్య ఆశ రాణి జీవితాలు ఒకేలా ఉంటాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో తీసుకున్న విడాకుల విషయం ఒక్కటి పక్కన పెడితే మిగతా జీవితం మొత్తం వీరిద్దరివి అచ్చం ఒకేలా ఉన్న విధంగా కనబడుతుంది.

ముందుగా వీరిద్దరిలో ఆశ రాణి జీవిత ప్రస్థానం చూస్తే ఈవిడ కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద నటుడైన రాజేష్ కుమార్తె. తన తండ్రి నటజీవితాన్ని అందిపుచ్చుకున్న ఆవిడ కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా రథసప్తమి అనే చిత్రంతో వెండితెరకు ప్రవేశం చేసింది. 1986 లో విడుదలైన ఆ సినిమానే ఆవిడకు చివర సినిమాగా మారింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఆశ రాణి సినీ కెరియర్ ముగించడానికి గల కారణం ఆవిడ యాక్షన్ హీరో అర్జున్ ని ప్రేమించి వివాహం చేసుకోవడం. ఆవిడ తన సినిమా కెరియర్ ని పక్కన పెట్టేసి హీరో అర్జున్ తో రెండు సంవత్సరాల పాటు ప్రేమ లో మునిగితేలి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. 1988లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆశ రాణి అసలు పేరు నివేదిత. వీరిద్దరి దంపతులకు ఐశ్వర్య, అంజన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆశ రాణి పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి తన కుటుంబంతోనే జీవనం కొనసాగించింది. అయితే దాదాపు 20 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్లీ ఆవిడ మరికొన్ని సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా సంవత్సరాల తర్వాత రెండు సినిమాల్లో ఆవిడ నటించింది. ఇప్పటికి కూడా తన భర్త కు కావాల్సిన కాస్ట్యూమ్స్ కూడా ఆవిడే దగ్గర ఉండి చూసుకుంటుంది.

ఇక ఆశ రాణి జీవితం లాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ జీవితం కూడా ఉంటుంది. రేణుదేశాయ్ సినిమాల్లోకి రాకముందు ఓ మోడల్ గా పని చేసేది. ఆవిడ మోడల్ రంగం నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత రేణు దేశాయ్ కూడా కేర్ పక్కన పెట్టేసి తనకి ప్రేమ ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయే వరకు కూడా పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ ఫ్యాషన్ డిజైనర్గా ఉంటూ అన్ని ఆవిడే చూసుకునేది. అయితే పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వడంతో ఆవిడ అన్ని వదిలేసి పిల్లలతో సహా పూణే నగరానికి చేరుకుంది. అయితే బద్రి సినిమా తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తోనే జానీ అనే సినిమాను కూడా చేసింది. దశాబ్ద కాలం తర్వాత రేణు దేశాయ్ మళ్లీ తల్లి పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం నటన మాత్రమే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈవిడ సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఇలా ఇద్దరు హీరోయిన్స్ జీవితాలు మొదటి సినిమాతోనే ప్రేమలో పడి ఆ తరువాత నటనకు పులిస్టాప్ చెప్పడం జరిగింది. అయితే రేణుదేశాయ్ పవన్ తో విడాకులు అనే అంశం పక్కన పెడితే.. పవన్ అభిమానులు ఇప్పటికీ రేణుదేశాయ్ ని ముద్దుగా వదిన అంటూ పిలుస్తూ ఆవిడను ఎంతగానో ఆదరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here