ఇప్పుడంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ కానీ ఆయన కెరీర్ మొదలు పెట్టిన రోజుల్లో చాలా చాలా సీదా సాధ హీరో మాత్రమే. క్యారెక్టర్ పాత్రలు, విలన్ పాత్రలు మొదటగా నటించి ఆ తర్వాత తన నటనకు మెరుగులు దిద్దు కుంటూ రోజురోజుకీ సుప్రీం హీరో గా అవతారం ఎత్తాడు.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి గారి గురించి చాలా కొద్దిమందికే తెలుసు.

చిరంజీవి తండ్రి గారి పేరు వెంకట్రావు. ఆయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. నిజానికి ఈయనకు కూడా సినిమాల్లో నటించాలని చాలా అభిలాష ఉండేది. అందులో భాగంగానే 1969 లో విడుదలైన జగత్ కిలాడి సినిమాలో ఓ చిన్న పాత్రలో వెంకట్రావు నటించారు. దాంతో ఆయన సినిమాల పై ఉన్న మక్కువను తీర్చుకున్నట్టు అయింది. అంతేకాదు ఆ సినిమా మంచి హిట్ కూడా సంపాదించుకుంది. అలా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా తర్వాత కుటుంబ బాధ్యతల నేపథ్యంలో అలాగే తాను చేస్తున్న ఉద్యోగం కారణంగా ఆయన సినిమాలవైపు మళ్ళీ తిరిగి రాలేదు. ఆయనకు సినిమాల పట్ల ఉన్న మక్కువ తో తన పెద్ద కొడుకు అయినా చిరంజీవిని నటన వైపు వెళ్లేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి రోజురోజుకు ఎదగడాన్నీ చూసి తండ్రి మురిసిపోయారు.

అయితే చిరంజీవి నటించిన సినిమాలో తన తండ్రి వెంకట్ రావు కూడా నటించాడు అన్న విషయం తెలుగు ప్రేక్షకులకి చాలా తక్కువ మందికి తెలుసు. అలా తండ్రి కొడుకులు ఏ సినిమాలో నటించారంటే బాపుగారు తీసిన సూపర్ హిట్ సినిమా మంత్రి గారి వియ్యంకుడు.. ఈ సినిమా లో డైరెక్టర్ బాపు మంత్రిగారి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి కోసం వెతుకుతుండగా ఎవరు సరైన నటులు దొరకలేదు. ఆ సమయంలో ఆ సినిమాకు అల్లు రామలింగయ్య కీలక పాత్రలో నటిస్తుండగా ఆయనతో కూడా వెళ్లి చర్చించగా దీనికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు ఈ పాత్రకు తన బావ వెంకట్రావు గారు సరిగ్గా సరిపోతారని చెప్పడంతో నిమిషంలో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్లయింది.. ఆ సినిమాలో అల్లు రామలింగయ్య ఓ ఇంటికి వెళ్లడం అక్కడ ఉన్న మంత్రి పాత్రలో వెంకట్రావు నటించడం జరిగింది.

అంతేకాదు అల్లు రామలింగయ్య ఇంట్లోకి వెళ్ళే సమయంలో ఇంటి బయట ఉన్న బోర్డు లో కూడా కె. వెంకట్రావు మంత్రి అని వ్రాసి ఉండటం కూడా చూపించబడుతుంది. ఇలా చిరంజీవి తన తండ్రితో కలిసి సన్నివేశంలో నటించకపోయిన ఇద్దరు కాలిడి మంత్రి గారి వియ్యకుండు సినిమాలో నటించారని చాలా మందికి తెలియదు. అప్పట్లో ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియకపోయిన ఇప్పడు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీకు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే యు ట్యూబ్ లో ఉంది చెక్ చేసుకోండి. నాటి రోజుల్లో ఇలా తండ్రి కొడుకులు ఒక సినిమాకు నటించడం చాలా తక్కువ కానీ ఇప్పుడు అయితే తండ్రులు హీరోలుగానే కొడుకులు హీరోలు గానే కొనసాగుతున్నారు. చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగానే మంచి మార్కెట్ ఉంది. అలాగే తమిళ్ హీరో విక్రమ్ అలాగే అతడి కొడుకు కూడా ఇద్దరు హీరోలుగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here