ముత్యాలముగ్గు హీరో శ్రీధర్ సినిమాలకు ఎలా దూరమయ్యారు? ఎన్ని కోట్లు సంపాదించారో తెలిస్తే షాక్ అవుతారు..!

0
6510

1975వ సంవత్సరంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాలముగ్గు సినిమాలో హీరోగా నటించిన శ్రీధర్ తన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించారు. ముత్యాలముగ్గు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంలో నటించినప్పటికీ శ్రీధర్ ఎంతో కాలం హీరోగా కొనసాగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21వ తేదీన దిగువ మధ్యతరగతి కుటుంబంలో శ్రీధర్ జన్మించారు.

‘తల్లా పెళ్లామా’ చిత్రంలో తెలుగు జాతి మనది పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీధర్ మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేసి 1964లో హైదరాబాద్ నగరానికి తరలి వచ్చి అక్కడే ప్రభుత్వ మండల శాఖ లో గుమాస్తాగా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం పూట కళాశాలకి వెళ్ళి డిగ్రీ పూర్తి చేశారు శ్రీధర్. తదనంతరం అనేక ప్రముఖ నాటకాల్లో తన నటనా చాతుర్యాన్ని చూపి అందరి మన్ననలను పొందారు.

మంచుతెర నాటకంలో నటించిన శ్రీధర్ ఆంధ్ర నాటక కళా పరిషత్తు నుండి ద్వితీయ బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ చౌదరి సినిమా లో ఎన్టీరామారావు కి కుమారుడిగా నటించారు. శ్రీధర్ ఏ ఒక్క రోజు కూడా సినీ అవకాశం కోసం నోరు తెరిచి అడిగిన సందర్భాలే లేవట. కానీ వచ్చిన ప్రతి సినిమా అవకాశం లో నటించేందుకు సిద్ధపడే వారట. ఆ క్రమంలోనే శ్రీ రామ పట్టాభిషేకం సినిమా లో గుహన్ పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారు ఎన్టీరామారావు. అయితే ఆ పాత్రలో నటించాలంటే డ్రైవర్ రాముడు సినిమాలోని ఓ పాత్రలో కూడా నటించాలని ఒక నిబంధన పెట్టారట రామారావు గారు.

ఐతే ఆ రెండు సినిమాల్లోని పాత్రల్లో నటించడానికి శ్రీధర్ ఓకే చెప్పి తన నటనా ప్రతిభను కనబరిచారు. కానీ ఈ రెండు పాత్రల్లో నటించిన తరువాత అతడిని సహాయనటుడిగా పరిగణించింది తెలుగు చిత్ర పరిశ్రమ. దాంతో శ్రీధర్ కి హీరో అవకాశాలు రాకుండా పోయాయట. సహాయ నటుడిగా నటించే అవకాశాలు వచ్చాయి.. వాటన్నిటిలో అయన నటించినప్పటికీ సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అయన సినిమాల్లో బిజీ ఉంటున్న సమయంలోనే రియల్ ఎస్టేట్ రంగంవైపు అడుగులు వేసారు శ్రీధర్. నిజానకి చెప్పాలంటే శోభన్ బాబు కంటే ముందే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టిన శ్రీధర్ అక్కడ బాగానే సంపాదించారు. దానితో పాటూ సినిమాలకు ఫైనాన్సింగ్ కూడా చేసేవారు. అయితే ఫైనాన్స్ చేస్తున్నప్పుడు మధ్య ఉన్న వ్యక్తీ మోసం చేయడంతో కాస్త డబ్బులు పోగొట్టుకున్నా.. అప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు కూడబెట్టారట శ్రీధర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here