సినీరంగంలోకి ప్రవేశించాక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉండడం మాములు విషయమే. ఒక్కోసారి సినిమా హిట్ అవుతుంది. మరోసారి పరాజయం పాలవుతుంది. అయిన కృంగిపోకుండా ముందుకు సాగిపోతుంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎందుకు అనుకుంటున్నారా..? ఒకానొక సమయంలో ఎంతో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్లు ఒక్కసారిగా కిందకు పడిపోతారు. అప్పుడు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన వారు, తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గాని, హీరో తల్లిగా, హీరోయిన్ తల్లిగా, అక్కగా, వదినగా ఇలా సరిపెట్టుకోవాలిసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ గా నటించిన తరువాత పెళ్లి చేసుకుని కొంతకాలం అయ్యాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే నటీమణులు చాలా మందినే ఉన్నారు. అందుకనే ఆ హీరోయిన్స్ సినిమాలో నటించే ఈ అవకాశం వచ్చినాగాని వదిలిపెట్టకుండా నటిస్తారు. అలాగే వాళ్ళ రెమ్యూనిరేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

ఇప్పుడు అలాంటి కోవలోకి చెందిన హీరోయిన్స్ లో రమ్య కృష్ణ ఒకటి. అప్పట్లో కుర్రకారును తన అందంతో ఒక ఊపు ఊపిన నటి రమ్యకృష్ణ. దాదాపు అందరి హీరోల సరసన నటించింది. తరువాత దర్శకుడు అయిన కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. తరువాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసింది. అలాగే కొన్ని సినిమల్లో హీరోకి అమ్మగా, అత్తగా, అక్కగా కూడా చేసి అందరిని మెప్పించింది. అయితే రమ్యక్రిష్ణ కు ఉన్న క్రేజ్ ఇప్పటికి ఏమాత్రం తగ్గలేదు.. ఎందుకంటే ఇప్పటి హీరోయిన్స్ కి సరిసమానమైన పారితోషకం తీసుకుంటుందంటే ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రమ్యకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా బాహుబలి.. ఈ చిత్రానికి ముందు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతా పేరు, ప్రఖ్యాతలు రాలేదు. ఎప్పుడయితే ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామి లాంటి పవర్ ఫుల్ పాత్ర చేసిందో అప్పటినుండి రమ్యకృష్ణ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. తరువాత నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇంకేముంది ప్రతి ఒక్క దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో రమ్యకృష్ణ కావాలని క్యూ కడుతున్నారు. ఎంత పారితోషకం అయినా సరే ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే రమ్యకృష్ణ తమ సినిమాలో నటిస్తే సినిమాకు ఒక హైప్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకనే పారితోషకం విషయంలో ఆలోచించడం లేదు. ఇప్పటి హీరోయిన్స్ తీసుకునే పారితోషకానికి సమానంగా తీసుకుంటుందట. ఇక రెమ్యునిరేషన్ విషయానికి వస్తే ఒక్క రోజుకి 10 లక్షలు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది రమ్యకృష్ణ. అంటే 10 రోజులు షూటింగ్ లో పాల్గొంటే కోటి రూపాయల దాక డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ, సాయి తేజ్ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాల్లో కూడా ఇదే స్థాయిలో పారితోషకం తీసుకుంటుందట.

ప్రస్తుత స్టార్ హీరోయిన్లు అయిన పూజ హేగ్జే, కీర్తి సురేష్, రష్మిక వంటి వారు ఒక్కో సినిమాకు ఒకటిన్నర కోటి నుండి రెండు కోట్ల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఇంకా కుర్ర హీరోయిన్లు అయిన నిధి అగర్వాల్, నభా నటేష్, పాయల్ రాజపుత్ లాంటి వారు 70 లక్షల నుండి కోటి రూపాయల దాక పారితోషకాన్ని అందుకుంటున్నారు. అయితే ఈ కుర్ర హీరోయిన్స్ కు పోటీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు అంతా రెమ్యూనిరేషన్ తీసుకుంటుందంటే మాములు విషయం కాదు. అది ఒక్క రమ్యకృష్ణ వల్లనే సాధ్యం అయినది. అయితే రమ్యకృష్ణ సినిమాలతో పాటు ఒక జీ తెలుగులో ప్రసారమయ్యే ఒక సీరియల్ లో కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. రమ్యకృష్ణ సినిమాలో గాని, సీరియల్ ల్లో గాని నటిస్తే హిట్ అవుతుందని భావించి ఆమె అడిగినదానికల్లా సై అంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే, రమ్యకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ అప్పుడయినా, ఎప్పుడయినా ఏ మాత్రం తగ్గలేదు.































