సినీ రంగంలోకి ప్రవేశించాక ఎలాంటి ఒడిదుడుకులు వచ్చిన గాని తట్టుకుని నిలబడాలి. అలాగే సినీ రంగంలో ఉన్న స్టార్లు, ఎక్కువగా సినీ ఫీల్డ్ లో ఉన్న వారినే ఇష్టపడి మరి పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తరువాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి అయిష్టత అనేది ఏర్పడి, విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు . అలాంటి నటులు, నటీమణులు మన సినీ ఇండస్ట్రీ లో చాలామందినే ఉన్నారు. ఇప్పుడు అలాంటి కోవకి చెందిన వారిలో ఈ స్టార్ కపుల్ అయిన దిలీప్, మంజు వారియర్‌లు కూడా ఉన్నారు. అలాగే వీళ్ళతో పాటు విడాకుల బాటలో నడిచిన మరొక జంట నటి కావ్య మాధవన్, నిశ్చల్ చంద్ర.

ఇకపోతే నటి కావ్య మాధవన్ విషయానికి వస్తే మాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె పేరు బాగా పాపులర్. తన అందంతో, అభినయంతో అందరిని ఆకర్షించేది కావ్య. ఆమె ప్రత్యేకత ఏమిటంటే కుటుంబ కథా చిత్రాలతో పాటుగా రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలలో కూడా ఎక్కువగా నటించింది. 1991 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో అడుగుపెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా మాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే కావ్య మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా అందరికీ సుపరిచితమే. తెలుగులో శివపురం అనే చిత్రంలో కూడా నటించినది. ఆమె ఎక్కువగా మలయాళీ కామెడీ హీరో దిలీప్ కుమార్ తో అత్యధిక సినిమాల్లో నటించి రికార్డు కూడా క్రియేట్ చేసింది. వీరిద్దరూ కలసి దాదాపు 18 సినిమాల్లో నటించారంటే చెప్పుకోదగ్గ విషయమే కదా. అయితే వీరు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలే అవ్వడం విశేషం. వరుస సినిమాలతో దూసుకుపోతున్న వీరిద్దరూ ఒకప్పుడు బాలీవుడ్ లో హిట్ పెయిర్ అయితే వీరిద్దరి మధ్య ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంది అనుకుని అప్పట్లో మాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి కూడా. కానీ దిలీప్ కుమార్ కు అప్పటికే పెళ్లి అయిపోవడంతో వీరి ప్రేమకు ఆటకం కలిగింది.

అయితే ఇంట్లోవాళ్లు బలవంతం చేయడంతో కావ్య 2009లో నిశ్చయ్ చంద్ర అనే మలయాళీ యువకుడిని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లిపోయింది. అయితే కొన్ని రోజులు సజావుగానే సాగిన వీళ్ళ కాపురంలో కొన్ని కలహాలు వచ్చాయి. ఎందుకంటే నిశ్చల్ చంద్రని పెళ్లి చేసుకునే సమయానికి కావ్య మనసులో దిలీప్ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకుంది కావ్య. అయితే వీళ్ళ కాపురం మూడు రోజుల ముచ్చటగా మారిపోయింది. కావ్య నిశ్చల్ చంద్రతో సఖ్యతగా ఉండలేకపోయింది. గొడవలు కూడా జరిగాయి. విడాకుల కోసం భర్తని వేధించడం మొదలు పెట్టింది నిశ్చల్ చంద్ర మాత్రం కావ్యకి విడాకులు ఇవ్వడానికి ససేమిరా అనడంతో చేసేదిలేక ఒక పథకం ప్రకారం దిలీప్ కుమార్తో కలిసి భర్తను బెదిరించింది. అయితే నిశ్చయ్ ను బెదిరించిన ఆడియో టేపులను నిశ్చల్…అమ్మ కోర్టులో కూడా సమర్పించారు. ఒకానొక సందర్భంలో బెదిరించారట కూడా. దిలీప్, కావ్య ఇద్దరు కలిసి గృహ నిర్బంధం చేసి నిశ్చల్ ను భయపెట్టారు కూడా. హై డ్రామా చేసి డొమెస్టిక్ కేసు కూడా పెట్టారు. చివరికి పెద్దల సమక్షంలో 2019 లో భర్తతో విడాకులు తీసుకుంది.

ఈ విధముగా కావ్య తన మొదటి భర్తని వదిలించుకుంది. మళ్ళీ తరువాత దిలీప్ ను మర్చిపోలేక ఆయనతో ప్రేమాయణం మొదలుపెట్టింది. దిలీప్ 1998 లోనే నటి మంజు వారియర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చి మరి జీవించాడు. మంజు తన అదృష్ట దేవత అని పలుమార్లు మీడియాలో కూడా చెప్పారు. అయితే అంతటితో ఆగకుండా వారి ప్రేమ, వైవాహిక జీవితంలో అనుభవించిన మధుర క్షణాలను సల్లాపం అనే పేరుతో మనోరమ అనే వీక్లీ లో అచ్చు కూడా వేయించాడు… అయితే సాఫీగా జరుగుతున్న వీళ్ళ కాపురంలో కావ్య విలన్ గా మారింది.. సినిమాల్లో హీరోయిన్ గా దిలీప్ పక్కన నటించిన కావ్య, దిలీప్ నిజం జీవితంలో మాత్రం విలన్ గా మారింది. కావ్య మీద ప్రేమతో కట్టుకున్న భార్య కి విడాకులు ఇచ్చాడు 17 ఏళ్ల వివాహ బంధాన్ని 2017 లో తెగతెంపులు చేసుకున్నాడు. పెళ్లితో సినిమాలను ఆపివేసిన మంజు మళ్ళీ తన నటనతో సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. విడాకుల తరువాత ఆలస్యం చేయకుండా వెంటనే దిలీప్, కావ్యలు పెళ్లితో ఒక్కటి అయ్యారు. ఇక్కడితో కధ సుకాంతం అవ్వలేదు.

దిలీప్, కావ్య ఇద్దరు కలిసి ప్రముఖ నటి భావనను కిడ్నప్ చేసి వివస్త్రగా మార్చి, ఆమెను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయాలనే పథకం రచించారు. వీళ్ళ క్రిమినల్ వేషాలు అభిమానులకు, మీడియా వాళ్లకు తెలిసిపోయింది. భావన కిడ్నాప్ విషయంలో కావ్య పాత్ర పూర్తిగా ఉంది. ఎందుకంటే భావన ను కిడ్నాప్ చేసిన ఒక క్రిమినల్ కావ్య కు సంబందించిన ఒక వీడియోను పోలీసుల ముందు బయట పెట్టాడు. దాంతో పోలీసులు కావ్యను, వాళ్ళ అమ్మను విచారించారు.






























