హీరో అజిత్.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వ్యక్తి ఈయన. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా వెండితెరకు పరిచయమైన తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు. ఇక ఆయన భార్య నటి షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో బాలనటిగా తన నట ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు ఎంతో మంది ఆవిడ అభిమానులుగా మారారు అంటే అతిశయోక్తి కాదు. తన చెల్లెలుకు షామిలి తో పోటీ మరి ఆవిడ నటించేది. జగదేకవీరుడు అతిలోకసుందరి, బ్రహ్మపుత్రుడు ఇలాంటి టాలీవుడ్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల లో ఓ ముద్ర వేసుకుంది. ఈవిడ దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమలో దాదాపు 50కి పైగా సినిమాలలో బాలనటిగా నటించారు.

ఇక నటి షాలిని నటుడు అజిత్ ఒకానొక సమయంలో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమకి నాంది పలికింది ఓ సినిమా షూటింగ్ స్పాట్. ఆ సినిమా పేరు అమర్ కాలం.. 1999 లో రిలీజ్ అయిన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు హీరోహీరోయిన్ల మధ్య ఓ చిన్నపాటి యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా హీరోయిన్ షాలిని కి గాయం అయింది. అయితే ఆ గాయం పూర్తిగా తన వల్లే జరిగిందని అజిత్ తెగ ఫీల్ అయిపోయి ఆమెకు క్షమాపణ చెప్పారట. అయితే ఈ సినిమా షూటింగ్ కంటే ముందే వారిద్దరికీ పరిచయం ఉండేది.

నిజానికి ఆ సినిమాలో నటించడానికి హీరోయిన్ షాలిని ఒప్పుకోలేదట. దానికి కారణం ఆ సమయంలో ఆవిడ ఇంటర్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎలాగైనా ఆమెను నటింపచేయాలని హీరో అజిత్ స్వయంగా దర్శక నిర్మాతలను ఒప్పించి మరీ సినిమాను కొన్ని రోజుల పాటు వాయిదా వేయించాడు. అయితే ఇందుకు కారణం షాలిని అదివరకు ముందు హీరోయిన్ గా నటించిన సినిమా ‘ కధలకో మర్యాధై’ అనే సినిమాలో ఆవిడ నటనను చూసి అజిత్ ఆ సినిమాలో ఎలాగైనా శాలినిని నటింప చేయాలని నిర్ణయించుకున్నాడట. దీంతో శాలిని ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక అమర్ కాలం సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఆ సమయంలో అజిత్ నటించిన సినిమా సంబంధించి ప్రీమియర్ షో కు నటి షాలిని ప్రత్యేకంగా ఆహ్వానించారట.

అయితే ప్రీమియర్ షో కి షాలిని కర్లీ హెయిర్ తో రావడం అజిత్ కు నచ్చలేదట. దీంతో ఆయన వెంటనే షాలిని తో నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు. మీకు కర్లీ హెయిర్ అంతగా బాగోలేదు ఇదివరకు సినిమాలో తన లుక్ గురించి చెబుతూ అందులో ఎంత బాగున్నారు అంటూ తెలిపాడు. ఈ విషయాలను ఆయన మొహమాటం లేకుండా ఆవిడతో చెప్పడంతో ఒకింత షాక్ కు గురైన.. ఆ తర్వాత ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అయితే అమర్ కాలం అనే సినిమాలో హీరోయిన్ కు జరిగిన చిన్న సంఘటన అయినా ఆ తర్వాత ఆయన ఆమెను కంటికి రెప్పలా కాపాడుకొనే వారట. చాలా బాగా కేర్ తీసుకునేవాడట. ఇలాంటి సమయంలోనే అజిత్ సమయంలో హీరోయిన్ షాలిని కి తాను ప్రేమిస్తున్నట్లు మనసులో మాట చెప్పాడట. తొలుత షాలిని ఈ విషయం సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆ తర్వాత రోజుల్లో అజిత్ ని ప్రేమించడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. కాకపోతే అప్పటికే ఆవిడ ఒప్పుకున్న సినిమాలు అన్ని పూర్తి చేసుకుని అజిత్ ను వివాహం చేసుకుంది.






























