దర్శకులకు కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలు కూడా కొత్త సినిమాలను తెచ్చి పెడుతుంటాయి. అలాంటి పరిస్థితే పూరి జగన్నాథ్ కి ఎదురయింది. 1989 శివ సినిమాతో ప్రారంభమైన పూరి ప్రయాణము దాదాపు పది సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ తో బద్రి తీసే అవకాశం వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బద్రి సినిమాని హిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జగపతిబాబుతో బాచి సినిమా తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ కన్నడ రాజ్ కుమార్ ఫ్యామిలీ కి ఆ సినిమా బాగా నచ్చింది.

కన్నడ రాజ్ కుమార్ మూడవ కొడుకు పునీత్ రాజ్ కుమార్ ని హీరోగా పరిచయం చేయాలి. అప్పుడు రాజ్ కుమార్ ఫ్యామిలీ కన్నడ దర్శకులు చెప్పిన ఎన్నో కథలు విన్నారు. కానీ ఏ ఒక్క కథ కూడా వాళ్లకు నచ్చలేదు. అలాంటప్పుడు ఏ దర్శకుడితో తెరంగేట్రం చేయించాలనే విషయంలో పూరి జగన్నాథ్ అయితేనే కరెక్ట్ గా ఉంటుందనుకున్నారు. పూరికి ఒకరోజు రాజ్ కుమార్ ఇంటి నుంచి పిలుపు రావడం జరిగింది. అప్పుడు పూరి జగన్నాథ్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి కథ చెప్పడంతో మొత్తం ఫ్యామిలీ కి ఆ కథ నచ్చింది. ఇంకేముంది ఒకప్పటి కన్నడ హీరోయిన్ మమతా రావు కూతురు రక్షితను హీరోయిన్ గా పెట్టి అప్పు అనే సినిమాను తీయడం జరిగింది. కన్నడంలో ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

సిమిలర్ గా అదే కథతో రవితేజ హీరోగా రక్షిత హీరోయిన్ గా ఇడియట్ అనే సినిమాను తెలుగులో రూపొందించారు. ఇడియట్ అనే తిట్టుని టైటిల్ గా పెట్టడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ప్రేక్షకుల దృష్టిని మరల్చాలి అంటే ఇలాంటి టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని పూరి జగన్నాథ్ చెప్పారు. సింధూరం లో రవితేజ పాత్ర పేరు కూడా చంటిగాడు అదే పేరును ఇడియట్ సినిమా లో కూడా రవితేజకు పెట్టడం జరిగింది. ఇడియట్ సినిమా 2002 ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here