ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 47 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఐఓసీఎల్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా పైప్ లైన్స్ విభాగానికి చెందిన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనవరి 15వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం ఫిబ్రవరి 14 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా 47 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 47 ఉద్యోగ ఖాళీలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖాళీలు 27 ఉండగా టెక్నికల్ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి. 2020 సంవత్సరం డిసెంబర్ 22 నాటికి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు నిబంధనల మేరకు వయో సడలింపులు ఉంటాయి. రాత పరీక్ష, స్కిల్ లేదా ఫిజికల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పరీక్షల ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు తుది ఎంపిక రాత పరీక్షలో సాధించిన మార్కులు, ఫిట్ నెస్ ను బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది.
వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అర్హతలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనంతో పాటు ఆలవెన్సులు కూడా లభిస్తాయి.































