IPL 2022: దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితులను మరోసారి తలికిందులు చేసేలా కనిపిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు ఇలాంటి భయాల్ని కల్పిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్ లో పనిచేసే సిబ్బందికి దాదాపు 300 మంది పైగా కోవిడ్ బారిన పడ్డారంటేనే అర్థం చేసుకోవచ్చు… కోవిడ్ థర్డ్ వేవ్ ఎంతలా విరుచుకుపడుతోంది.

ఇలా దేశంలో ప్రతిరోజూ 1 లక్ష కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వేవ్ నుంచి తప్పించుకోవడానికి నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్లు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ కోవిడ్ వ్యాప్తి అనేది క్రికెట్ పై కూడా పడుతోంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్ లను కోవిడ్ కారణంగా రద్దు అయ్యే అవకాశం ఏర్పడింది.

బీసీసీఐ ఇప్పటికే అనేక దేశీయ టోర్నమెంట్‌లను రద్దు చేసింది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022పై కూడా ఈ ప్రభావం చూపుతోంది.
కోవిడ్ 19 బయో-బబుల్‌ను ఉల్లంఘించినందున ..
రాబోయే నెలల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని బీసీసీఐ నమ్మకంగా ఉంది. అయితే పరిస్థితి మరింత దిగజారితే టోర్నమెంట్‌ను విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సాధ్యమైనంతగా ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ బీసీసీఐ టోర్నమెంట్‌ను విదేశాలకు మరిస్తే మాత్రం.. ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఐపీఎల్ నిర్వహించడం వరుసగా ఇది మూడో సారి అవుతుంది. ఐపీఎల్ 2020 మొత్తం సీజన్ యూఏఈలో జరిగింది. 2021లో కూడా కరోనా కారణంగా.. ఇండియాలో కేవలం 30 మ్యాచ్‌లను నిర్వహించగలిగింది. అంతే కాదు.. కోవిడ్ 19 బయో-బబుల్‌ను ఉల్లంఘించినందున టోర్నమెంట్‌ను మేలో వాయిదా వేయవలసి వచ్చింది. ఇలా ఐపీఎల్ మాత్రమే కాకుండా.. దుబాయ్ లో 2021 టీ20 వరల్డ్ కప్ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా హోమ్ సీజన్‌లో వెస్టిండీస్ , శ్రీలంకలకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. దీని తర్వాతనే ఐపిఎల్‌కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.





























