అదృష్టం ఎటు నుంచి తలుపు తడుతుందో తెలియదు. అప్పడే మనం వాటిని అందుకోవాలి.. లేదంటే మరో సారి ఆ అవకాశం రాదు. ఏం చేసినా.. అదృష్టం ఉండాలి అని అంటుంటారు.. ఇది నిజమే. ఎంత కష్టం చేసినా కాస్తంత అదృష్టం ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. లేక పోతే ఎక్కడ నుంచి జీవితం మొదలు పెట్టామో అక్కడే ఉంటాం.

అయితే ఇలాంటి లక్ తో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. అతడికి లాటరీ తగిలింది అనుకుంటున్నారా.. కాదు.. అతడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.కోటి గెలుచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ బెట్టింగ్ అంటే ముఖ్యంగా డ్రీమ్ 11 గుర్తుకు వస్తుంది. దీనిలో పాల్గొనే వారు తనకంటూ ఉన్న 22 మంది టీమ్ సభ్యుల్లో 11 మందిని ఎంచుకొని అందులో బెట్టింగ్ పెడతారు.
ఇలా అతడు ప్రెడిక్ట్ చేసిన ఓ సెలూన్ షాప్ యజమానికి రూ.కోటి గెలుచుకున్నాడు. బిహార్ లోని మధుబని జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు ఈ అదృష్టం తట్టింది. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ కు ఓ సెలూన్ ఉంది. అతడికి తన జీవనాధారం ఆ సెలూన్ షాపే. డ్రీమ్ 11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ.కోటి అతనిని వరించాయి.
అతడికి క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ తో అతడు డ్రీమ్ 11 యాప్ లో ఎప్పుడూ బెట్టింగ్ పెడుతూ ఉంటాడట. కానీ ఎనాడు డబ్బులు గెలుచుకోలేదని.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పైనా బెట్టింగ్ పెట్టాడు. దీనిలోనే అతడు రూ.కోటి గెలుచుకున్నాడు. అయితే ఆ డబ్బులతో ఇల్లు కట్టుకొని.. మిగతా డబ్బులను అప్పు తీర్చుకుంటానని చెప్పాడు. అయితే తన వృత్తిని మాత్రం వదలనని చెప్పుకొచ్చాడు.



























