YS Jagan: వైయస్ జగన్ 2019 ఎన్నికలలో భాగంగా 151 అసెంబ్లీ స్థానాలను సింగిల్ గా గెలిపించుకొని సరికొత్త రికార్డులను సృష్టించారు. ఇక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగాయని ఆ తప్పుల కారణంగానే 2024లో ఘోరమైన ఓటమి అందుకున్నారని బ్లూ మీడియా ఓ రేంజ్ లో జగన్ తప్పు లేదని కప్పిపుచ్చుతోంది.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలను, పార్టీ నాయకులను ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. అయితే తన కింద ఉన్నటువంటి కొంతమంది సలహాదారులు వారే ముఖ్యమంత్రిగా ఫీల్ అయ్యి కార్యకర్తలను అలాగే వారి సమస్యలను జగన్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నారని, అదే ఈ ఎన్నికలలో ఘోర పరాజయానికి కారణమని బ్లూ మీడియా చెబుతోంది.
అయితే ఇటీవల తాడేపల్లి నివాసం వద్దకు కొంతమంది కార్యకర్తలు వెళ్లడంతో జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వకుండా వారిని బయటకు గెంటేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ వీడియో పై కూడా కొంతమంది జగన్ కి ఈ విషయం తెలియదని, తన కింది వారు జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వకుండా చేస్తున్నారని చెబుతోంది.
జగన్ మారాల్సిందే..
ఇక జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాలు చేరలేదు అనేది చాలా సిల్లీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫోన్ వాడరని గతంలో చెప్పాడు. కనీసం టీవీలో వార్తలు అయినా చూస్తారు కదా ,సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూసిన ఈ విషయాలు జగన్ దృష్టికి వెళ్తాయి. కానీ జగన్ గతంలో చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూ పెద్ద తప్పు చేస్తున్నారని, ఇలాగే పార్టీ కార్యకర్తలను నాయకులను దూరం పెడితే తిరిగి జగన్ అధికారంలోకి రావడం చాలా కష్టమని చెప్పాలి.





























