Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇక ఇప్పటికే ఈ కార్యక్రమం మూడు వారాలు పూర్తి చేసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి చేతూ ఎలిమినేట్ అవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విధంగానే అతను ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ మూడవ వారంలో మూడవ కంటెస్టెంట్ గా చైతూ ఎలిమినేట్ కావడంతో ప్రతి ఒక్కరు ఎంతో షాకయ్యారు. ఇక ఈయన ఎలిమినేట్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ ఎలిమినేషన్ లో ఏదో కుట్ర దాగి ఉంది అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చైతు ఇలా ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.కొబ్బరికాయలు టాస్కులో సంచాలక్ గా, బిందు మాధవి ప్లేట్ విసిరేసినప్పుడు తనకు మద్దతుగా చైతు నిలిచారు.అప్పటినుంచి అందరిలో చేతి పై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది మూడవ వారం ఎలిమినేట్ అయ్యాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఎలిమినేషన్ లో కుట్ర జరిగింది…
బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చైతు ఈ విధంగా మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఈ విధంగా ఈయన ఎలిమినేషన్ గురించి పలురకాల కామెంట్లు వస్తున్నాయి. ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అయితే చైతూకి ఇంత తక్కువ ఓట్లు వచ్చేవి కాదని ఈయన ఎలిమినేషన్ లో ఏదో కుట్ర దాగి ఉంది అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.
































