నిరుద్యోగులకు ఇస్రో బంపర్ ఆఫర్.. రూ. 2 లక్షల వేతనంతో ఉద్యోగాలు..?

0
107

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు, ప్రతిభ ఉన్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 61 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్రో నుంచి విడుదలైంది. https://www.vssc.gov.in/vssc/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎం.ఈ, ఎంటెక్, పీహెచ్డీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. పోస్టుల ఆధారంగా 74,660 రూపాయల నుంచి 2,08,000 రూపాయల వరకు ఉన్నాయి. ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. ఇస్రో విడుదల చేసిన నోటిఫికేషన్ లో పలు ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంది.

కొన్ని ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి వయోపరిమితి నిబంధనలు లేవు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం లేకపోయినా, ఫోటో, సంతకంలలో పొరపాట్లు చేసినా దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు 250 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండగా ఫిమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here