Maghadeera: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మగధీర. రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనమైన విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా 2009 జూలై 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సరిగ్గా ఈ సినిమా విడుదలయ్యి 15 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించి సినిమాలను తీయలేదు. ఈ సినిమా కోసం ఏకంగా 44 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
ఇలా రాజమౌళి ఏకంగా ఈ సినిమా కోసం ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడంతో ఈ సినిమా విడుదల అయ్యే వరకు దర్శక నిర్మాతలు ఇద్దరు కూడా చాలా ఆందోళనలో ఉండేవారు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు ఏకంగా 15 కోట్లకు పైగా షేర్ ని రాబట్టిన మగధీర.. ఫుల్ రన్ లో రూ. 60 కోట్ల షేర్, రూ. 128 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా రికార్డులు సృష్టించింది.
వెయ్యి రోజులు ప్రదర్శితం..
ఇక ఈ సినిమా అప్పట్లోనే 223 థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకొని సంచలనంగా నిలిచింది. కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్‌లో 1000 రోజులు ప్రదర్శితమై మగధీర మరో అరుదైన రికార్డును మగధీర చిత్రం సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళికి అలాగే రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ పేర్లు ఇండస్ట్రీలో మారుమోగిపోయాయి వీరిద్దరికి తదుపరి వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.



























