బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే సన్నీ విజేతగా నిలిచాడు. కప్పు ముఖ్యం బిగులు అంటూ చెప్పిన తన ఫ్రెండ్స్ మాటను నిజం చేశాడు. ఇక తన ఆటతోనే కాదు.. మాటలతో కూడా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో సిరి-షణ్ముఖ్ ఇతన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా.. చివరికి తన క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తూ షర్ట్‌లో చేయిపెట్టాడని రచ్చ చేసినా.. అవేవీ తన వ్యక్తిత్వాన్ని చెరపలేవని చెప్పకనే చెప్పాడు.

హౌస్ లో ఉన్నంత వరకు అతడినే టార్గెట్ చేసినా ఏనాడు ఆటలో వెనకడుగు వేయలేదు. తన చిరునవ్వును చిందిస్తూనే ఇతర మొహాల్లో నవ్వును తెప్పించాడు. పక్కన ఉన్నవాడు బాధపడుతుంటే.. అతడు తన శత్రువు అయినా పక్కకు చేరి.. ఓదార్చాడు. ఇవన్నీ అతడి మంచితనానికి నిదర్శనం అనే చెప్పాలి.
హౌస్ లో టాప్ 5కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే కొంతమందిలో కామెడీ లేకపోవడం.. మరికొంతమందిలో ఎమోషనల్ పండించడకపోవడం.. ఆటలో ఎక్కువగా పాల్గొనకపోవడం లాంటివి ఉన్నాయి. కానీ సన్నీలో ఏమి లేవో వెతుక్కోవాల్సిన పరిస్థితి.. అతడిలో ప్రతీ యాంగిల్ దాగి ఉంది.
అందుకేనేమో ప్రేక్షకులు అతడిని గెలిపించారు. ఇక అతడు హౌస్‌లో ఉన్న 106 రోజులు సన్నీని శత్రువుగానే చూసిన షణ్ముఖ్, సిరీల గురించి సన్నీ స్టేజ్ మీద ఎమోషనల్‌గా మాట్లాడి దటీజ్ బిగులూ అనిపించాడు. ‘సార్ ఇక్కడ మాట్లాడినా నామినేషన్‌లో మాట్లాడినట్లే ఉంది సార్..’ అంటూ కామెడీతో స్పీచ్ మొదలుపెట్టిన సన్నీ.. మొదట అందరికీ థాంక్స్ చెప్పాడు.
తర్వాత తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చాడు. తర్వాత అరియానా హోస్ట్ గా చేస్తున్నా బిగ్ బాస్ బజ్ లో కూడా అతడు మాట్లాడాడు. హౌస్ లో అతడు బాధపడ్డ క్షణాలు.. సంతోషించన మధురానుభూతులు చెప్పుకొచ్చాడు. దీనిలో అందరి గురించి మాట్లాడుతూ.. పింకీ లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అతడికి సంబంధించి బజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























