Allu Arjun: ఒకప్పుడు సినిమా అంటే కొన్ని కామెడీ సన్నివేశాలు, కొన్ని ఫైట్ సన్నివేశాలు, కొన్ని రొమాంటిక్ పాటలు ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేది. అయితే కాలం మారుతున్న కొద్ది ప్రేక్షకులు కూడా సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. ఎంత స్టార్ హీరో హీరోయిన్లు నటించిన కథలో కొత్తదనం ఉండాలని భావిస్తున్నారు.

ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే దర్శకనిర్మాతలు కూడా సినిమాలో హీరో హీరోయిన్లను భిన్నంగా చూపించడం, విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నంలో ఒక భాగమే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్, చిత్తూరు యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఈ విధమైనటువంటి లుక్, యాస మాట్లాడటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా అల్లు అర్జున్ చిత్తూరు యాసలో చెప్పే డైలాగులకు ప్రేక్షకులు ఎంతో ఫిదా అయ్యారు. అయితే అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు వెనక చిత్తూరు జిల్లా,నాయుడుపేట మండలం పూడూరు ప్రాంతానికి చెందిన చరణ్ అనే యువకుడు కష్టం ఎంతో ఉందని చెప్పవచ్చు.
Allu Arjun : ఆ డైలాగు చెప్పించే సరికి చెమటలు పట్టాయి…
ఈ సందర్భంగా చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ నాకి బన్నీ సర్ అంటే ఎంతో ఇష్టం అయితే అతని సినిమాకి నాకు ఇలాంటి మంచి అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఎంతో ఆనందపడ్డారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తో ఆడే కూలోడు.. ఆడికి మనం కులోళ్ళవేంట్రా అంటూ బన్నీ సార్ కు డైలాగ్ చెబుతున్న సమయంలో భయంతో నా తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ డైలాగ్ నేర్పిస్తున్న సమయంలో నాకు చెమటలు పట్టాయి.ఈ డైలాగ్ నేర్పించిన తర్వాత అల్లు అర్జున్ తనని మెచ్చుకోవడంతో చాలా సంతోషం వేసిందని ఈ సందర్భంగా చరణ్ తెలియజేశారు.
































