Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ఆ తర్వాత పలు టీవీ కార్యక్రమాల ద్వారా విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుని బుల్లితెర హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఇలా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

సినిమా అవకాశాలు అంటే సినిమాలో కీలక పాత్రలో నటించడం కాదండోయ్… హీరోగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సుడిగాలి సుదీర్ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా జబర్దస్త్ కార్యక్రమంలో అయితే ఒక్కో స్కిట్ కి ఇంత అని ఉంటుంది కానీ సినిమాకు అలా కాదు. సుడిగాలి సుదీర్ ఒక రోజు తన కాల్షీట్ ఇవ్వడం కోసం సుమారు ఏడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఒక సినిమాకు సుమారు 70 నుంచి 100 రోజుల వరకు తన కాల్షీట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్…
ఈ విధంగా దాదాపు మూడు నెలల వరకు ఒక సినిమా కోసం తన టైం కేటాయిస్తున్న సుడిగాలి సుదీర్ ఒక్క సినిమాకి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు సుధీర్ కి ఉన్న క్రేజ్ బట్టి అతనికి కోటి రూపాయలు ఇవ్వడం తక్కువే అని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.ఈయన నటించిన సినిమాలు కనుక హిట్ అయితే సుధీర్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.































